Bengaluru News: అడవిపందిని కాల్చబోయి.. అనంతలోకాలకు..
ABN, Publish Date - Nov 22 , 2025 | 12:13 PM
అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగా దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్‌తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు.
- వేటలో మిస్‌ఫైర్...
- అడవిపందిని కాల్చబోయి గురి తప్పిన నాటు తుపాకీ.. వేటగాడి దుర్మరణం
బెంగళూరు: అడవిపందిని వేటాడబోయి ఓ వేటగాడు దుర్మరణం పాలయ్యాడు. రామనగర(Ramanagara) జిల్లా మాగడి అటవీప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వెళ్లిన సమయంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో వేటగాడు పాండురంగ (35) దుర్మరణం చెందాడు. స్నేహితుడు కిరణ్‌తో కలసి నాటుతుపాకీతో వేటకు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున కెబ్బేపాళ్య గ్రామ శివారులోని అటవీప్రాంతంలో వెళ్తున్నారు. ఒక్కసారిగా అడవిపంది పాండురంగ సమీపానికి వచ్చింది. కాల్చడం ఆలస్యం అవుతుందని తుపాకీని తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు.
అంతలోనే ట్రిగ్గర్‌కు తగలడంతో బుల్లెట్ నేరుగా పాండురంగ కాలిలోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. స్నేహితుడు కిరణ్ అక్కడనుంచి కొంతదూరం తీసుకెళ్లాడు. కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. పాండురంగను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు పాండురంగ కుటుంబీకులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా తుపాకీ ఉపయోగించడంపై దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా నాటు తుపాకీలతో జంతువులను వేటాడితే చర్యలు తప్పవన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 22 , 2025 | 02:49 PM