High Court: సోషల్ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:00 AM
ప్రముఖ సంగీత స్వరకర్త ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా ఫొటోను సామాజిక మాధ్య మాలైన ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌సా ్టగ్రామ్, యూట్యూబ్ వంటి నెట్‌వ ర్కింగ్ సైట్లలో...
మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంగీత స్వరకర్త ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా ఫొటోను సామాజిక మాధ్య మాలైన ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌సా ్టగ్రామ్, యూట్యూబ్ వంటి నెట్‌వ ర్కింగ్ సైట్లలో ఉపయోగిం చడంపై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక నిషేధం విధించి ంది. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తన అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించడాన్ని నిషేధిం చాలని కోరుతూ ఇళయరాజా హైకోరు ్టలో పిటీషన్ దాఖలు చేశారు. ఏఐ టెక్నాల జీ సాయంతో తన ఫొటోను మార్ఫింగ్ చేసి వాణిజ్యపరంగా వినియోగిస్తూ ఆదాయాన్ని అర్జిస్తున్నా రని, ఇది తన వ్యక్తిగత హక్కులను హరించే చర్య అని పేర్కొన్న ఇళయయరాజా..ఇకపై తన అనుమతి లేకుండా ఎవ్వరూ ఉపయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిం చారు. ఆయన అభ్యర్థనను పరిగణన లోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇళయరాజా ఫొటోలను ఆయన అను మతి లేకుండా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో తాత్కాలికంగా ఉపయోగిం చరాదని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.