ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ప్రాణం తీసిన ప్రశ్న.. గొడ్డలితో నరికి.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - Sep 09 , 2025 | 12:09 PM

ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్ముకొని తాగేశావా అని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తన భార్యను ఆదివారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాఘవేంద్ర, లక్ష్మిదేవి(30)లు నివాసమున్నారు. వీరికి శృతి అనే కుమార్తె ఉంది. రాఘవేంద్ర కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.

- తిండి గింజలు అమ్ముకుంటావా అని ప్రశ్నించిన భార్య

- గొడ్డలితో నరికి చంపిన భర్త

చిలమత్తూరు(అనంతపురం): ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్ముకొని తాగేశావా అని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తన భార్యను ఆదివారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాఘవేంద్ర, లక్ష్మిదేవి(30)లు నివాసమున్నారు. వీరికి శృతి అనే కుమార్తె ఉంది. రాఘవేంద్ర(Raghavendra) కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

భర్త జులాయిగా తిరుగుతుండటంతో లక్ష్మిదేవి కుటుంబ పోషణకోసం కూలి పనులకు వెళ్లేది. ఈక్రమంలో ఆదివారం ఆమె పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో నిల్వ ఉంచిన 50 కిలోల బియ్యాన్ని రాఘవేంద్ర ఎత్తుకెళ్లి అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. కూలి పని నుంచి వచ్చిన లక్ష్మిదేవి ఇంట్లో బియ్యం కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహం చెందిన రాఘవేంద్ర రాత్రి 10 గంటల పైన నిద్రపోతున్న లక్ష్మిదేవిని గొడ్డలితో నరికాడు.

ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మిదేవిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 12:39 PM