ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మక్కా మసీదులో పేలుళ్లకు 18 ఏళ్లు..

ABN, Publish Date - May 18 , 2025 | 10:40 AM

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలోగల మక్కా మసీదులో పేలుళ్లు జరిగి నేటికీ 18 ఏళ్లు అవుతోంది. అయితే.. ఆ పేలుళ్లకు పాల్పడ్డ అసలైన నిందితులను పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.

- ఇప్పటికీ పట్టుబడని నిందితులు

- బాధ్యులను కఠినంగా శిక్షించాలంటున్న బాధిత కుటుంబసభ్యులు, నగరవాసులు

హైదరాబాద్: హైదరాబాద్‌(Hyderabad) నగరంలోని మక్కామసీదులో బాంబూ పేలుళ్లు సంభవించి నేటికి 18 ఏళ్ళు గడిచినా అసలైన నిందితులను పట్టుకోలేకపోయారని పాతబస్తీ వాసులు, మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2007 మే 18న శుక్రవారం (జోహర్‌) నమాజ్‌ తర్వాత పేలిన బాంబూ పేలుళ్లలో ఏడుగురు మృతి చెందగా అక్కడ జరిగిన పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వంటగది కిటికీలోనుంచి చొరబడి..


ఈ ఘటనలో అసలైన దోషులను వదిలేసిన నాటి పోలీసు అధికారులు అమాయకులైన సుమారు 100 మంది ముస్లిం యువకులను అరెస్టు చేసి నానా హింసకు గురిచేసినట్టు నాడు పోలీసుల చేతుల దెబ్బలు తీన్న పలువురు వాపోయారు. దేశంలో ఎన్నో పేలుళ్లు, హింసాత్మాక ఘటనలు జరిగినా కేంద్ర నిఘా సంస్థలు విచారించి దోషులను గుర్తించి శిక్షించాయని..


కానీ.. పాతబస్తీ మక్కా మసీద్‌ పెళ్లుళ్ల ఘటపై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాటి విషాధకర ఘటనకు పాల్పడిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 10:40 AM