ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Penny Decision: పెన్నీలకి గుడ్‌బై..ఇకపై వీటి తయారీ ఉండదన్న ట్రంప్ ప్రభుత్వం

ABN, Publish Date - May 24 , 2025 | 01:26 PM

అమెరికా ట్రంప్ ప్రభుత్వం (Trump Penny Decision) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్నీ గడచిన రెండు శతాబ్దాలుగా చలామణిలో ఉన్నా, ఇప్పుడు ఆ చరిత్ర ముగియబోతోంది. దీంతో ఖర్చును తగ్గించడమే కాదు, డిజిటల్ యుగంలో వీటి అవసరం లేదని చెబుతున్నారు.

Trump penny decision

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా ప్రభుత్వం (Trump Penny Decision) కొత్తగా పెన్నీలు (1 సెంట్ నాణేల) తయారుచేయదు. ఈ క్రమంలో యూఎస్ మింట్ (US Mint) కొత్త పెన్నీలు రావని అధికారికంగా ధృవీకరించింది. ఒక పెన్నీ తయారుచేయడానికి ప్రభుత్వానికి దాదాపు 4 సెంట్లు ($0.0369) ఖర్చవుతోంది. ఇది నాణేల విలువ కంటే అధికంగా ఉండటం విశేషం. 2024లో పెన్నీ తయారీ ఖర్చు 20.2% పెరిగిందని US మింట్ వార్షిక నివేదిక తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


ఎంత ఆదా అవుతుంది

పెన్నీల తయారీ ఆపితే ప్రభుత్వానికి సంవత్సరానికి సగటున $56 మిలియన్ (రూ. 465 కోట్లు) ఆదా అవుతుందని అంచనా. ఇది కేవలం మెటీరియల్ ఖర్చు మాత్రమే. ప్రస్తుతం దేశంలో 114 బిలియన్ పెన్నీలు చలామణిలో ఉన్నప్పటికీ, అవి వాడకంలో లేవని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. పెద్ద మొత్తంలో డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో చిన్న నాణేల అవసరం దాదాపు పూర్తిగా తగ్గిపోయింది.

ట్రంప్ నిర్ణయం

ఈ ఏడాది ఫిబ్రవరిలో, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పెన్నీ ఉత్పత్తిని నిలిపివేయాలని తన ట్రెజరీ కార్యదర్శికి ఆదేశించారు. చాలా కాలంగా యునైటెడ్ స్టేట్స్ పెన్నీలను తయారు చేస్తోంది. ఇవి ఒక్కోటి తయారీకి 2 సెంట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇది ఎంతో వృథా అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్‌లో పేర్కొన్నారు.


తర్వాత ఏం జరుగుతుంది

2026 నాటికి మాత్రమే చివరి పెన్నీలు తయారవుతాయి. ప్రజలు వాటిని ఇంకా వాడతారు. కానీ వాటి వాడకం నెమ్మదిగా తగ్గుతుంది. నగదు లావాదేవీల్లో ధరలను నిక్కెల్ (5 సెంట్లు) వరకు రౌండింగ్ చేయవచ్చు. యూఎస్ మింట్ తమ చివరి ఆర్డర్‌ను పెన్నీ బ్లాంక్‌ల కోసం ఇచ్చిందని, ఆ బ్లాంక్‌లు అయిపోయిన తర్వాత పెన్నీ నాణెం ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ శాఖ అధికారి ధృవీకరించారు. 2026 ప్రారంభంలో కొత్త పెన్నీలను ప్రవేశపెట్టడం ఆపివేయాలని ట్రెజరీ శాఖ నిర్ణయించింది. ఆ తర్వాత, ఈ నాణెం పూర్తిగా ప్రజల వినియోగం నుంచి తొలగిపోనుంది.


ఇతర దేశాల్లో ఏమైంది

అయితే కెనడా 2012లో పెన్నీలను ఆపేసింది. ధరలు 5 సెంట్లకు రౌండ్ చేయడం మొదలుపెట్టారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా ఇదే విధానం పాటించాయి. అయితే ఇదే ట్రెండ్ ఇండియాలో కూడా కొనసాగుతుందా అంటే మాత్రం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికీ అనేక ప్రాతాల్లో చిల్లర నాణాల వినియోగం కొనసాగుతోంది. రూపాయి నుంచి 10 రూపాయల నాణాల వినియోగం ఎక్కువగా ఉంది.


ఇవీ చదవండి:

జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్

నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 01:55 PM