ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెక్‌ వ్యూ గరిష్ఠ స్థాయిల్లో మరో పరీక్ష

ABN, Publish Date - May 12 , 2025 | 05:24 AM

నిఫ్టీ గత వారం 24,500 వద్ద విఫలం కావడమే కాకుండా 500 పాయింట్ల మేరకు ఇంట్రా వీక్‌ కరెక్షన్‌తో 24,000 సమీపంలో ముగిసింది. వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసినా కీలక మద్దతు స్థాయి 24,000 కన్నా...

టెక్‌ వ్యూ : గరిష్ఠ స్థాయిల్లో మరో పరీక్ష

నిఫ్టీ గత వారం 24,500 వద్ద విఫలం కావడమే కాకుండా 500 పాయింట్ల మేరకు ఇంట్రా వీక్‌ కరెక్షన్‌తో 24,000 సమీపంలో ముగిసింది. వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసినా కీలక మద్దతు స్థాయి 24,000 కన్నా పైన క్లోజ్‌ కావడం కొంత ఊరట. నెలవారీ చార్టుల్లో కూడా ఏప్రిల్‌లో ఎగువకు బలమైన రివర్సల్‌ బార్‌ ఏర్పడింది. స్వల్పకాలిక పాజిటివ్‌ ట్రెండ్‌ ఉండవచ్చుననేందుకు ఇది నిదర్శనం. ప్రస్తుత ధోరణులను బట్టి చూసినట్టయితే ఈ వారంలో ఎగువకు గ్యాప్‌తో ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. అందువల్ల ప్రధాన గరిష్ఠ స్థాయి 24,500 వద్ద మరోసారి పరీక్ష ఎదుర్కొనవచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: ట్రెండ్‌లో సానుకూలత కోసం నిఫ్టీ మైనర్‌ నిరోధం 24,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 24,500. గత కొద్ది రోజుల్లో ఏర్పడిన ప్రధాన గరిష్ఠ స్థాయి కావడం వల్ల ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక పాజిటివ్‌ సంకేతం వెలువడుతుంది.

బేరిష్‌ స్థాయిలు: 24,500 వద్ద విఫలమైతే మరింత బలహీనత ఉండవచ్చన్న హెచ్చరికతో కూడిన సంకేతం వెలువడుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 24,250, 24,000. ఇక్కడ కూడా విఫలమైతే బలహీనత ఏర్పడక తప్పదు. అయితే ఈ మద్దతు స్థాయి కొంత దూరంగా ఉన్నందు వల్ల తక్షణ ముప్పు ఉండదు.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కీలక స్థాయి 54,000 వద్ద విఫలం కావడం గరిష్ఠ స్థాయిల్లో మరింత కన్సాలిడేషన్‌ అవసరం అనేందుకు సంకేతం. ఇప్పుడు తదుపరి నిరోధం 54,400 వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడనిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 55,000. ప్రస్తుత స్థాయి 54,000 వద్ద విఫలమైతే బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 20, 200 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఈ సూచీల వద్ద నిలదొక్కుకోవాలి. అలాగే 24,500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత సానుకూల ధోరణి ఏర్పడుతుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం సోమ, గురువారాల్లో తదుపరి రివర్సల్స్‌ ఉన్నాయి.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,410, 24500

మద్దతు : 24,260, 24,200

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 05:24 AM