ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - May 21 , 2025 | 06:34 AM

దేశంలో బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ (Gold rates today May 21st 2025) వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఎందుకంటే గత 24 గంటల్లో భారీగా పెరిగిన ధరలు మళ్లీ తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.

gold rates today on may 21st 2025

దేశంలో పసిడి ప్రియులకు మళ్లీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నేడు (మే 21, 2025) ఉదయం నాటికి వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం (Gold rates today May 21st 2025) పట్టాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 510 తగ్గిపోయి రూ.95,010 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,090కు చేరుకుంది.

ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 95,160గా ఉండగా, 22 క్యారెట్ పసిడి ధర రూ. 87,240గా ఉంది. ఇక చెన్నె, ముంబై, కోల్‌కతా, కేరళ, పూణేలో 24 క్యారెట్ పుత్తడి ధర 10 గ్రాములకు రూ.95,010గా ఉండగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 87,090 స్థాయికి చేరుకుంది.


ఈరోజు వెండి రేట్లు (May 21st 2025 silver rates)

ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో మే 21, 2025న ఉదయం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1200 తగ్గిపోయి రూ.96,900 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కేజీ వెండి ధర రూ.1100 తగ్గి రూ.1,07,900కు చేరుకుంది. మరోవైపు చెన్నై, కేరళ, భోపాల్‌ వంటి ప్రాంతాల్లో కూడా వెండి రేట్లు రూ.1,07,900 స్థాయికి చేరుకున్నాయి. దీంతోపాటు నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై వంటి ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ. 96,900గా కలదు.


బంగారం, వెండి ధరల తగ్గుదలకు గల కారణాలు

  • అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం: అమెరికా డాలర్ బలపడడం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి

  • భారతదేశంలో డిమాండ్ తగ్గడం: వివాహాలు, పండుగలు తగ్గడం వల్ల బంగారం డిమాండ్ తగ్గడం

  • ప్రభుత్వ విధానాలు: స్వర్ణ దిగుమతులపై విధించిన పన్నులు, టాక్స్‌లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి

  • భవిష్యత్తులో ఎలా: గత 10 రోజులలో బంగారం ధరలు సుమారు రూ.5,600 తగ్గాయి. భవిష్యత్తులో, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం, భారతదేశంలో డిమాండ్ వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ ధరలు గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ మారకం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, భారతదేశంలో బంగారం డిమాండ్ వంటి అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.


ఇవీ చదవండి:

Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..


Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 06:46 AM