ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, Publish Date - Jun 25 , 2025 | 06:49 AM

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు (Gold Rates Today June 25th 2025) ఒక్కసారిగా భారీగా తగ్గాయి. ఈ తగ్గుదల వినియోగదారులకు ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. అయితే ఈ మేరకు తగ్గింది, ఏంటనే విషయాలను తెలుసుకుందాం.

Gold Rates Today June 25th 2025

బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వీటి ధరలు (Gold and Silver Rates) నిన్నటితో పోల్చితే ఒక్కసారిగా తగ్గిపోయాయి (Gold Rates Today June 25th 2025). ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జూన్ 25, 2025న ఉదయం 6.30 గంటల నాటికి బంగారం ధరలు రూ.1620 పడిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,210కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 90,940కి చేరింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 99,360కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 91,010 స్థాయికి చేరింది.

నేటి వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.

మరోవైపు బంగారంతో పాటు, వెండి ధరలు కూడా భారీగా దిగజారాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 1000 తగ్గిపోయి రూ. 1,08,900 స్థాయికి చేరుకుంది. ఇక హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి రూ.118,900కి చేరింది. ఈ నేపథ్యంలో చెన్నై, కేరళ ప్రాంతాల్లో వెండి రేటు రూ.118,900గా ఉన్నాయి. నాసిక్, నోయిడా, మైసూర్, నాగ్ పూర్, పాట్నా, సూరత్, జైపూర్, ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూ. 108,900 స్థాయికి చేరుకున్నాయి.

బంగారం స్వచ్ఛమైనదా కాదా? ఎలా తనిఖీ చేయాలి?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ బంగారానికి 99.9 శాతం, 22 క్యారెట్ గోల్డ్ దాదాపు 91 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది. 22 క్యారెట్ బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 9% కలపి ఆభరణాలను తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉంటుంది (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని హాల్ మార్కులు ఉంటాయి.

ఇవీ చదవండి:

1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 06:56 AM