ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Prices: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు..

ABN, Publish Date - Mar 29 , 2025 | 07:02 AM

ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.

Gold and Sliver Prices

బిజినెస్ న్యూస్: ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గోల్డ్ ధరలో మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ (29-03-2025) ఉదయం 06:30 గంటల సమయానికి దేశవ్యాప్తంగా భారీ హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,583 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,000కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.81,721 కాగా.. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.89,150గా ఉంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.81,849 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.89,290కు చేరింది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధర పరిస్థితి ఎలా ఉందంటే..

  • కోల్‌కతా- రూ.81,611, రూ.89,030

  • చెన్నై- రూ.81,959, రూ.89,410

  • బెంగళూరు- రూ.81,785, రూ.89,220

  • పుణె- రూ.81,721, రూ.89,150

  • అహ్మదాబాద్- రూ.81,831, రూ.89,270

  • భువనేశ్వర్- రూ.81,739, రూ.89,170

  • భోపాల్- రూ.81,803, రూ.89,240

  • కోయంబత్తూర్- రూ.81,959, రూ.89,410

  • పట్నా- రూ.81,675, రూ.89,100

  • సూరత్- రూ.81,831, రూ.89,270


వెండి ధరల పరిస్థితి ఇది..

దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో కిలో వెండి ధర లక్ష మార్క్‌ను దాటింది. శనివారం ఉదయం 06:30 గంటల సమయానికి ఢిల్లీలో వెండి ధర రూ.100,400గా ఉంది. ముంబైలో కేజీ రేటు రూ.100,570కి చేరుకోగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో ధర రూ.100,730 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Financial Year Market Performance: రూ.26 లక్షల కోట్లు

Updated Date - Mar 29 , 2025 | 07:23 AM