ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: క్షమాపణలు చెప్పాల్సిందే: వైఎస్ షర్మిల

ABN, Publish Date - Jun 09 , 2025 | 07:07 PM

రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన మీడియాలో ప్రసారమైన చర్చ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.

APPCC Chief YS Sharmila

అమరావతి, జూన్ 09: రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్షమాపణలు చెప్పడం వైఎస్ భారతీరెడ్డి బాధ్యతని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పడంలోనూ తప్పులేదన్నారు. సోమవారం నాడు విజయవాడలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిదని ఆమె తేల్చి చెప్పారు.

అమరావతి, మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. ఏపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ అంశంపై ఇప్పటివరకూ వైసీపీ కానీ, సాక్షి మీడియా కానీ క్షమాపణ చెప్పలేదని ఆమె మండిపడ్డారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం కానీ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలోని బీజేపీని విమర్శించడం లేదని మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా.. నేటికీ ఒక్క విభజన హామీ కూడా నెరవేరలేదన్నారు. మోదీ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో విభజన హామీల అమలుపై ఏ ఒక్కరూ పోరాటం చేయలేదని షర్మిల ఆగ్రహించారు.

ఇవి కూడా చదవండి

పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టు బిగ్ షాక్

అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్: వైఎస్ జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 08:56 PM