High Court: పీఎస్ఆర్ ఆంజనేయులుకు హైకోర్టు బిగ్ షాక్
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:03 PM
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ మ్యూల్యాంకనం కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది.
అమరావతి, జూన్ 09: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రశ్నా పత్రాల మూల్యాంకనం కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుతోపాటు ఏ2 దాత్రి మధు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. అనారోగ్య కారణాల రీత్యా రెండు వారాల మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పీఎస్ఆర్ ఆంజనేయులను హైకోర్టు ఆదేశించింది.
ఒక వేళ పీఎస్ఆర్ ఆంజనేయులు ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తే.. తాజా మెడికల్ రిపోర్టులను తెప్పించుకుని, పరిశీలించి.. ఆయన బెయిల్ పిటిషన్‌ను రెండు వారాల్లో పరిష్కరించాలని ట్రయల్ కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు, దాత్రి మధులు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఇదే కేసులో ఏ1గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్‌ను కోర్టు ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించింది. ఆయన రిమాండ్ జూన్ 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అదే రోజు కోర్టులో హాజరు పర్చారు. దీంతో ఆయన రిమాండ్‌ను జూన్ 19వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. అదీకాక ఏపీపీఎస్సీ మ్యూల్యాంకనం కేసులో అంతా పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టునే తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఆయన పని చేశారు.
ఆ సమయంలో గ్రూప్ 1 మ్యూల్యాంకనంలో నిబంధనలకు విరుద్దంగా మరో ప్రదేశంలో ప్రైవేట్ వ్యక్తుల చేత మ్యూల్యాంకనం చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి ఏ1 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2 దాత్రి మధులను పోలీసుల అరెస్ట్ చేశారు. దాత్రి మధు విచారణ సమయంలో కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు దాత్రి మధు పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పత్రాల మ్యూల్యాంకనం సమయంలో ఆహార ఖర్చుల కింద రూ. 20 లక్షలు, అలాగే మరో కోటికి పైగా నగదు దాత్రి మధుకు పీఎస్ఆర్ ఆంజనేయులు నిధులు మంజూరు చేసినట్లు విచారణలో తెలింది. ఇక పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు విచారిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులకు ఆయనే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాక ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ సందర్బంగా ఆయన పలుమార్లు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
అరాచకానికి ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్: వైఎస్ జగన్
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
Read Latest AP News And Telugu News