Nara Lokesh: ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? వైసీపీ నేత సజ్జలపై నారా లోకేష్ ఆగ్రహం
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:33 PM
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
ఇంటర్నెట్ డెస్క్: తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తల పండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు.. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారని లోకేష్ అన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
అటు, పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్ట్స్-2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్
పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 05:58 PM