ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు ఫుల్ బిజీ..పూర్తి షెడ్యూల్ ఇదే

ABN, Publish Date - Mar 15 , 2025 | 08:40 AM

CM Chandrababu: సీఎం చంద్రబాబు శనివారం ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పలు అభివద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

CM Chandrababu

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శనివారం) పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హెలికాఫ్టర్‌లో ఉండవల్లి నుంచి తణుకు రానున్నారు. హెలిప్యాడ్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం 8.40 గంటలకు ఎన్టీఆర్ పార్క్‌కు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.


పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం స్వచ్ఛ్ దివస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 50 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఫొటో సెషన్ ఉంటుంది. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు చేరుకుంటారు. ప్రజావేదికపై నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. పారిశుధ్య కార్మికులను సీఎం చంద్రబాబు సత్కరిస్తారు. 10.15 గంటలకు పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో జరిగే సమావేశానికి హాజరవుతారు. 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం12 గంటల 10 నిమిషాలకు తణుకు నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.


తణుకులో పోలీసుల అత్యుత్సాహం

తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రోటోకాల్ జాబితాలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేరు కనిపించలేదు. ప్రోటోకాల్లో పేరు లేకపోవడంతో హెలిపాడ్‌కు వెళ్లకుండా పట్టాభిరామ్‌ను పోలీసులు ఆపివేశారు. పోలీసుల తీరుపై పట్టాభిరామ్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్‌తో మాట్లాడిన అనంతరం లోపలికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు పంపించారు.


వేంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీనివాసుని కల్యాణం జరుగనుంది. శ్రీనివాస కల్యాణం సందర్భంగా టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6:30గంటల నుంచి రాత్రి 8:30 నిమిషాల వరకు స్వామి వారి కల్యాణం జరుగనుంది. శ్రీవారి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu Naidu: నిబద్ధతతో కూడిన రాజకీయాలకు ప్రతీక జనసేన

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 08:56 AM