Minister Sandhyarani: ఆ జీవోను చంపేసిందే వైసీపీ..
ABN, Publish Date - May 02 , 2025 | 12:36 PM
జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అల్లూరి పాడేరు జిల్లా: ఉద్యోగుల విషయంలో ఆదివాసీ గిరిజన యువత (Adivasi tribal youth) అధైర్యపడొద్దని.. ఎవరి మాటలు విని, నమ్మి మోసపోవద్దని.. వైసీపీ రాజకీయ ఆట (YCP Political Game)లో నిరుద్యోగ యువత (Unemployed youth) పావులుగా మారొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhyarani) అన్నారు. అరుకు (Aruku)లో ఆదివాసీ విద్యార్ధుల బంద్‌పై మంత్రి సంధ్యారాణి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 16,437 డీఎస్సీ (DSC) పోస్టులలో 2,024 పోస్టులు గిరిజనులకే కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని డిమాండ్ చేయడం భావ్యమా అని ప్రశ్నించారు.
వైసీపీ ఆ జీవోను చంపేసింది..
జీవో నెం. 3ను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఆ జీవోను చంపేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయని వారి మాటలు నమ్మవద్దని మంత్రి గమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెం. 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకువస్తామనే మాటకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాల సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి సంధ్యారాణి చెప్పారు.
Also Read: గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు
వైసీపీ ఉచ్చులో పడొద్దు..
వైసీపీ ఉచ్చులో పడొద్దని ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్ధులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హితవు పలికారు. గత ఐదేళ్లు డీఎస్సీ అభ్యర్ధులు అనుభవించిన నరకానికి కూటమి ప్రభుత్వం మోక్షం కలిగించిందన్నారు. వైసీపీ హయాంలో ఎన్ని పోరాటాలు చేసినా స్పందన కరువైనా, కూటమి ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన డీఎస్సీ రద్దు చేయమని ఆందోళన చేయటం ఎంత వరకు సమంజసమన్నారు.
కాగా ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ సాధన కొరకు అల్లూరి జిల్లా అరకులోయలో ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర మన్య బంద్‌కు పిలుపిచ్చింది. మెగా డిఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ ప్రాంత పోస్టులు మినహాయింపు ఇవ్వాలని, ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని.. స్థానిక గిరిజనులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు నూరు శాతం కల్పించాలనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బందుకు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలైన బొర్రా గృహాలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, చాపరాయి జలపాతం మూతపడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కోడెల శివప్రసాదరావుకు మంత్రి లోకేష్ నివాళి..
గొర్రెల స్కామ్.. దళారి మొయినుద్దీన్ అరెస్ట్..
For More AP News and Telugu News
Updated Date - May 02 , 2025 | 12:58 PM