ACB: గొర్రెల స్కామ్.. దళారి మొయినుద్దీన్ అరెస్ట్..
ABN , Publish Date - May 02 , 2025 | 10:13 AM
గొర్రెల స్కామ్‌లో కేసు నమోదు అయినప్పటి నుండి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ పరరీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కీమును స్కామ్‌గా మర్చి రూ. 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కాం (Sheep Scam) కేసు (Cse)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 నిందితుడు (A1 accused) మొయినుద్దీన్‌ను (Moinduuddin) శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు (Arrest) చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) అదుపులోకి తీసుకున్నారు. గతంలో మొయినుద్దీన్‌పై పోలీసులు ఎల్‌వోసీ (LOC) జారీ చేశారు. మొయినుద్దీన్ కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరి పాస్ పోర్టును అధికారులు ఇన్పౌండ్ చేశారు. ఈ క్రమంలోనే మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ప్రధాని మోదీకి మనఃపూర్వకంగా స్వాగతం.
గొర్రెల స్కామ్‌లో కేసు నమోదు అయినప్పటి నుండి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ పరరీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కీమును స్కాముగా మర్చి రూ. 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు గొర్రెల స్కాములో 17 మందిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులు అరెస్ట్ అయ్యారు. లోలోన ది లైవ్ కంపెని పేరుతో దళారి వ్యాపారానికి మొయినుద్దీన్ అతని కుమారుడు ఈక్రముద్దీన్ తెరలేపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయగా.. ఇవాళ A1 నిందితుడు అయిన మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని వెంటనే విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్‌లో మొయినుద్దీన్‌దే కీలక పాత్ర అని అధికారుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.
కాగా మొహినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొహినుద్దీన్ భార్య కోకాపెట్‌లోని మూవీ టవర్స్ నివాసలో ఉంటున్నారు. మొహినుద్దీన్ నుంచి అతని భార్య బ్యాంకు ఖాతాకు భారీగా నగదు బదిలీ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సెర్చ్ వారెంట్ చూపించి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అర్ధరాత్రి వరకు సోదాలు చేశారు. సోదాల అనంతరం రెండు కార్లతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట
ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ భారీ భద్రత
For More AP News and Telugu News