Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..
ABN, Publish Date - May 23 , 2025 | 10:43 AM
Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ అధికారులు ఇంత వరకూ స్పందించలేదు. ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది తెలియరాలేదు.
విశాఖ: ఉక్కునగరం విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఎస్ఎంఎస్-2 (SMS-2)లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో కార్మికులు విధుల్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. అగ్నిప్రమాదం తెల్లవారుజామున జరగడంతో కార్మికులు విధులకు హాజరు కాలేదు.
అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. ఆస్తి నష్టం ఏ మేర జరిగిందనే విషయాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2లో ద్రవపు ఉక్కు ప్రమాదాలు జరుగుతుంటాయని కార్మికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఒకవైపు కార్మికులు చేస్తున్న దీక్ష.. మరోవైపు ఈ ప్రమాదం జరగడం.. సమయానికి కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.
Also Read: నువ్వు ఒకటంటే.. నేను రెండు అంటా..
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేపట్టారు. మంగళవారం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు సంఘీభావంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సైతం ఒకరోజు సమ్మె చేపట్టారు. ఉద్యోగులకు నోటీసులు.. కార్మికుల తొలగింపునకు నిరసనగా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రెగ్యులర్ ఉద్యోగులకు 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలన్న డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారు.
మరోవైపు కార్మికులకు మద్ధతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్‌లో విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు వారి డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీపీసీసీ ఛీఫ్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందా..
For More AP News and Telugu News
Updated Date - May 23 , 2025 | 11:42 AM