ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

APSRTC: ఉచితం సక్సెస్‌ కావాలంటే...

ABN, Publish Date - Jul 06 , 2025 | 04:22 AM

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతం కావాలంటే రాష్ట్రంలో కొత్తగా 3 వేల బస్సులను కొనుగోలు చేయాలి.

  • 3 వేల బస్సులు, 10 వేల మంది సిబ్బంది కావాలి

  • గుంటూరు ధర్నాలో ఈయూ నేత దామోదరరావు

గుంటూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విజయవంతం కావాలంటే రాష్ట్రంలో కొత్తగా 3 వేల బస్సులను కొనుగోలు చేయాలి. 10 వేల మంది సిబ్బంది నియామకం చేపట్టాలి’ అని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. గుంటూరు ఎన్‌టీఆర్‌ బస్టాండ్‌లో జరిగిన నిరసనకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఉచిత ప్రయాణంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగనుంది.

ప్రస్తుతం రోజుకు 40 లక్షల నుంచి 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో రాకపోకలు సాగిస్తున్నారు. ఉచిత ప్రయాణం తరువాత ప్రయాణికుల సంఖ్య 80 లక్షలకు పైనే పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఆర్టీసీ నివేదిక అందజేసింది. పెరగనున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల కొనుగోలుతో పాటు సిబ్బంది నియామకాలూ చేపట్టాలి. కాలుష్య నివారణలో భాగంగా విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వాటిని నడపడం, నిర్వహణ ప్రభుత్వ ఉద్యోగులతోనే చేయించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 04:22 AM