TDP Women Leaders : కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్
ABN, Publish Date - Aug 01 , 2025 | 01:05 PM
కోవూరు పట్టణంలోని తాలుకా ఆఫిస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. టీడీపీ మహిళలు నిరసనలు చేపట్టారు.
నెల్లూరు : కోవూరు పట్టణంలోని తాలుకా ఆఫిస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ మహిళలు నిరసనలు చేపట్టారు. ప్రసన్న కుమార్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్లాకార్డులతో ఆందోళన వ్యక్తం చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు.
శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ మహిళలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో మహిళలకు వైసీపీ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణను సద్దుమనిపించారు. ఈ ఘర్షణలో మహిళలపై వైసీపీ నాయకులు దాడికి తెగబడినట్లు టీడీపీ మహిళ నాయకులు ఆరోపిస్తున్నారు.
గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న మహిళపై ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తూ ఊరుకోమని మహిళలు హెచ్చరించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి కనీస విజ్ఞత మరిచి మహిళపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీశారు. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పటికైనా క్షమాపణ చెబితేనే, మహిళలు ప్రసన్న కుమార్‌ను క్షమిస్తారన్నారు.
ఇవి కూడా చదవండి..
రాజమండ్రి జైలుపై డ్రోన్.. టెన్త్ విద్యార్థిపై కేసు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 01 , 2025 | 01:05 PM