Share News

Drone Incident: రాజమండ్రి జైలుపై డ్రోన్‌.. టెన్త్‌ విద్యార్థిపై కేసు

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:21 AM

తండ్రి తీసుకొచ్చిన డ్రోన్‌ను సరదాగా గాల్లోకి ఎగరేసిన పదో తరగతి విద్యార్థి చిక్కుల్లో పడ్డాడు. ఆ డ్రోన్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఆవరణపై ఎగరడంతో.. ఆ బాలుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Drone Incident: రాజమండ్రి జైలుపై డ్రోన్‌.. టెన్త్‌ విద్యార్థిపై కేసు

రాజమహేంద్రవరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తండ్రి తీసుకొచ్చిన డ్రోన్‌ను సరదాగా గాల్లోకి ఎగరేసిన పదో తరగతి విద్యార్థి చిక్కుల్లో పడ్డాడు. ఆ డ్రోన్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఆవరణపై ఎగరడంతో.. ఆ బాలుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు వెనుక భాగంలోని నివాస భవనాల మీదుగా మంగళవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సెంట్రల్‌ జైలు ఆవరణపైకి ఓ డ్రోన్‌ ఎగిరింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఇక్కడే రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సీఎం చంద్రబాబును గతంలో ఇక్కడ రిమాండ్‌లో పెట్టినప్పుడు కూడా డ్రోన్‌ను ప్రయోగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ డ్రోన్‌ వ్యవహారంపై వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో విద్యార్థి డ్రోన్‌ను సరదాగా ఆపరేట్‌ చేశాడని గుర్తించారు.

Updated Date - Aug 01 , 2025 | 06:24 AM