Andhra Pradesh: ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య..
ABN, Publish Date - Apr 22 , 2025 | 10:03 PM
ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని హత్య చేశారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై గుర్తు తెలియని...
ప్రకాశం, ఏప్రిల్ 22: ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని హత్య చేశారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిపై గుర్తు తెలియని దుండగులు అటాక్ చేశారు. కత్తులతో పొడిచారు. అగంతకుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టీడీపీ నేత హత్యపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య చౌదరి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్‌కి తరలించారు. టీడీపీ నేత హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి లోకేష్ షాక్..
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య వార్త తెలుసుకుని మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణం అన్నారు. యువగళం పాదయాత్రలో తనతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని.. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.
ఎస్పీతో హోంమంత్రి..
ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యపై హోంమంత్రి అనిత్ స్పందించారు. వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. వీరయ్యను చంపిన నిందితులను తక్షణమే పెట్టుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాలో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు వేట సాగిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్యపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి మాట్లాడుతున్నారు.
మంత్రి రవికుమార్ షాక్..
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. హుటాహుటిన అమరావతి నుంచి ఒంగోలుకు బయలుదేరారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 22 , 2025 | 10:05 PM