Amaravati: కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:28 PM
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై కోర్టులో వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. తొలుత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచగా.. హోరా హోరీగా వాదనలు జరిగాయి.
అమరావతి, ఏప్రిల్ 22: లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుపై కోర్టులో వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. తొలుత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచగా.. హోరా హోరీగా వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున కళ్యాణి వాదనలు వినిపించారు. మద్యం పాలసీ పేరుతో అవినీతికి పాల్పడ్డారని.. ఉద్దేశపూర్వకంగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని వాదించారు. నెలకు రూ. 60 కోట్లు కసిరెడ్టి ద్వారా డబ్బులు చేతులు మారాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం రాజ్ డిక్టేట్ చేశారన్నారు. అవినీతి, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని పీపీ కళ్యాణి వాదనలు వినిపించారు.
అయితే, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో కసిరెడ్డి రాజ్ పేరు లేదు కదా అని కోర్టు ప్రశ్నించింది. కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ.. ఏసీబీ కోర్టులో ఈ కేసును ఎందుకు వేశారని న్యాయాధికారి ప్రశ్నించారు. 17a ఈ కేసులో ఎలా వర్తిందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. సీఐడి కేసు కూడా ఉన్నందున సీఐడీ కోర్టులో ఈ కేసు వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
మరోవైపు కసిరెడ్డి రాజ్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాజ్ కసిరెడ్డి.. వైసీపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడుగా ఉన్నారని.. ఆయనకు నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని వాదించారు. ఈ కేసు అసలు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదన్నారు. రాజకీయ కారణాలతోనే కసిరెడ్డిపై కేసు పెట్టారన్నారు. పిసి యాక్ట్ ఈ కేసులో అసలు అమలు కాదని పొన్నవోలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి.. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని అభిప్రాయపడ్డారు. మెమో వెనక్కి ఇస్తామని.. సిఐడి కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి సూచించారు. ఇందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో.. వాదనలకు తాత్కాలిక బ్రేక్ పడింది.
Also Read:
ముస్లిం కాదన్నాడు.. టెర్రరిస్టులు చంపేశారు..
For More Andhra Pradesh News and Telugu News..