Share News

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..

ABN , Publish Date - Apr 22 , 2025 | 08:11 PM

Terrorist In Pahalgam: పర్యాటకులే లక్ష్యంగా ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. అతి సమీపం నుంచి పర్యాటకుల్ని కాల్చి చంపారు. వారు ముస్లింలా కాదా తెలుసుకుని మరీ కాల్పులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Terrorist In Pahalgam

జుమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి పర్యాటకుల్ని కాల్చి చంపారు. టెర్రరిస్టుల దాడిలో ముగ్గురు చనిపోగా.. 9 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మిలటరీ డ్రెస్సు ధరించిన ఆ టెర్రరిస్టులు బైస్‌రన్‌లోని పర్యాటకులపై కాల్పులు జరిపారు. పర్యాటకులు ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ కాల్చి చంపారు. ప్రస్తుతం టెర్రరిస్టుల కాల్పుల్లో గాయపడ్డ, చనిపోయిన, క్షేమంగా బయటపడ్డ వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మనసును కలిచి వేసే విధంగా ఉంది.


టెర్రరిస్టుల దాడికి గురైన వారంతా హనీమూన్ కోసం అక్కడికి వచ్చిన వారు కావటం గమనార్హం. ఇక, ఆ వీడియోలో ఓ మహిళ తాను టెర్రిరిస్టుల నుంచి ఎలా తప్పించుకుందో చెప్పుకొచ్చింది. ‘ నేను సైడుకు కూర్చుని భేల్ పూరి తింటూ ఉన్నాను. నా భర్త పక్కనే ఉన్నాడు. ఓ వ్యక్తి నా భర్త దగ్గరకు వచ్చాడు. ‘నువ్వు ముస్లింవా’ అని అడిగాడు. నా భర్త కాదని చెప్పాడు. అంతే కాల్చి చంపాడు’ అంటూ కన్నీరు మున్నీరు అయింది. మరో మహిళ తన భర్తను కాపాడండి అంటూ ప్రాథేయపడుతూ ఉంది. అయితే, వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే ట్విటర్‌లో డిలీట్ చేసేశారు. వీడియోతో పాటు ఓ ఫొటో కూడా వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో మహిళ తన భర్త శవం దగ్గర కూర్చుని ఉంది.


ఉగ్రదాడిపై ప్రధాని ఆరా..

ప్రధాని నరేంద్ర మోదీ హహల్‌గామ్ ఉగ్రదాడిపై ఆరా తీశారు. ఆయన ప్రస్తుతం అరేబియా పర్యటనలో ఉన్నారు. సంఘటన గురించి తెలియగానే హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సంఘటనా స్థలానికి కూడా వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇక, పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. సంఘటనా స్థలానికి వెళుతున్నట్లు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Lady Aghori: లేడీ అఘోరీని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Updated Date - Apr 22 , 2025 | 08:18 PM