Viral Video: పాపం.. చచ్చిపోతాడని తెలీదు.. మరణానికి కొన్ని గంటల ముందు
ABN , Publish Date - Apr 22 , 2025 | 09:48 PM
Pahalgam Terrorist Attack: ఆర్మీ దుస్తులు ధరించిన ఓ ఏడుగురు వ్యక్తులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. హిందువులే లక్ష్యంగా వారు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో 27 మంది చనిపోగా.. 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌కు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పహల్‌గామ్, బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో దాదాపు 27 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. చనిపోయిన వారిలో మంజునాథ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడికి సంబంధించిన చివరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న మంజునాథ్ తన భార్య పల్లవితో కలిసి శ్రీనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భార్యతో కలిసి వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో మంజునాథ్ మాట్లాడుతూ ‘ నా పేరు మంజునాథ్. నాది కర్ణాటకలోని సివమొగ్గ.
మేము ఇండియన్ ట్రావెల్ స్టోర్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నాం’ అని అన్నారు. ఇక, మంజునాథ్ భార్య పల్లవి మాట్లాడుతూ.. ‘ నిన్న మేము బోట్ హౌస్‌లో ఉన్నాము. అది చాలా బాగుంది. ప్రస్తుతం మేము కాశ్మీర్‌లో షికారా రైడింగ్ చేస్తున్నాము. మా బోటును మహ్మద్ రఫికీ డ్రైవ్ చేస్తున్నాడు’ అని అంది. ఉగ్రదాడిలో భర్త చనిపోయిన తర్వాత పల్లవి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ దారుణ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘ నేను, నా భర్త, మా పిల్లాడు కాశ్మీర్ వెళ్లాం. అప్పుడు సమయం మధ్యాహ్నం 1.30 గంటలు. మేము పహల్‌గామ్‌లో ఉన్నాము.
నా కళ్ల ముందే నా భర్తను కాల్చి చంపేశారు. అదో దారుణమైన కలలా ఉంది. మూడు నుంచి నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నా భర్తను చంపేశారు. నన్ను కూడా చంపండి అని నేను గట్టిగా అరిచాను. ‘ మేము మిమ్మల్ని చంపం. పోయి ఈ విషయాన్ని మోదీకి చెప్పండి’ అని వారిలో ఓ వ్యక్తి నాతో అన్నాడు. నా భర్త శవాన్ని కిందకు తీసుకురావటం అంత సులభం కాదు. విమానంలో తీసుకురావాల్సిందే. శవాలను వెంటనే వెనక్కు తీసుకురావాలి ’ అంటూ అధికారులకు విజ్ణప్తి చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఉగ్ర దాడిలో చనిపోయిన మంజునాథ్ లాస్ట్ వీడియో
ఇవి కూడా చదవండి
Pahelgam Terrorist Attack: చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..