ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: 31, 2న చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్ల రద్దు

ABN, Publish Date - May 30 , 2025 | 11:46 AM

31వతేదీ, జూన్ 2వ తేదీన చెన్నై సెంట్రల్‌-గూడూరు సబర్బన్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే.. 1న చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మధ్య సబర్బన్‌ రైళ్లు పాక్షిక రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

చెన్నై: చెన్నై సెంట్రల్‌-గూడూరు(Chennai Central-Gudur) మార్గంలోని కవరపేట-గుమ్మిడిపూండి యార్డ్‌ మార్గంలో మరమ్మతుల కారణంగా శనివారం, జూన్‌ 2వ తేది ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు 19 సబర్బన్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో ప్రయాణికుల సౌకర్యార్ధం పొన్నేరి, మీంజూరు రైల్వేస్టేషన్ల నుంచి చెన్నై సెంట్రల్‌, చెన్నై బీచ్‌లకు ఆరు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.


1న చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మధ్య సబర్బన్‌ రైళ్లు పాక్షిక రద్దు

రైలు మార్గాల్లో మరమ్మతుల కారణంగా జూన్‌ 1వ తేది చెన్నై బీచ్‌-చెంగల్పట్టు మార్గంలో సబర్బన్‌ రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... కాటాన్‌ కొళత్తూర్‌ మార్గంలో జూన్‌ 1వ తేది ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు మరమ్మతుపనులు చేపట్టనున్నారు. ఆ సమయంలో చెన్నై బీచ్‌ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే సబర్బన్‌ రైళ్లు గుడువాంజేరి వరకు మాత్రమే నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 11:46 AM