మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా?: నారాయణ
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:32 AM
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మానికే వ్యతిరేకమని చెప్పారు. పవన్ కల్యాణ్ విరుద్ధంగా చేసిన పనులపై ప్రశ్నిస్తూ, ఆయననే మొదట జైల్లో పెట్టాల్సిన వ్యక్తిగా పేర్కొన్నారు.
ఎల్బీనగర్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే అంటున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవని చెప్పారు. ఎప్పుడూ సనాతనం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలను ఎందుకు మార్చారని నిలదీశారు. పవన్ చెప్పేదాన్ని బట్టి మొట్టమొదట జైల్లో పెట్టాల్సింది ఆయననే అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మంలో సతీసహగమనం ఉందని, దాన్ని ఒప్పుకొంటారా అని నిలదీశారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో నారాయణ మాట్లాడారు.
Updated Date - Jun 03 , 2025 | 05:35 AM