Andhra Pradesh: సజ్జల రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..
ABN, Publish Date - Apr 26 , 2025 | 07:54 PM
జనాదరణ పొందిన బ్రాండ్‌లను నిలిపివేసి, నాసిరకం బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో శ్రీధర్ రెడ్డిది కూడా కీలక పాత్ర అని పోలీసులు తేల్చారు. విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కసిరెడ్డి ..
విజయవాడ, ఏప్రిల్ 26: మద్యం కుంభకోణం కేసులో ఏ5గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే, రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డిపై 409, 420, 120 (B), R/W SEC. 34 & 37 OF IPC, SEC. 7, 7A, 8, 13 (1) (b), 13 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. జనాదరణ పొందిన బ్రాండ్‌లను నిలిపివేసి, నాసిరకం బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో శ్రీధర్ రెడ్డిది కూడా కీలక పాత్ర అని పోలీసులు తేల్చారు. విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకా ఏయే విషయాలు వెల్లడించారో చూద్దాం..
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం..
విజయసాయిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో వివిధ రూపాలలో నెలకు దాదాపు రూ. 50-60 కోట్లు సంపాదించవచ్చని సమావేశంలో నిర్ణయించుకున్నారు. మద్యం పాలసీ ఏర్పాటులో, ఆ తర్వాత నిర్ణయాలు చేసేందుకు సమావేశాల్లో కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. బ్రాండ్ కంపెనీలను పంపించేసి, సొంత తయారీ దారులను ఏర్పాటు చేయడంలో కూడా శ్రీధర్ రెడ్డి పాత్ర ఉంది. నూతన పాలసీ విధానం, డిస్టిలరీ కంపెనీలతో ఎప్పటికప్పుడు శ్రీధర్ రెడ్డి సమావేశాలు పెట్టి పలు సూచనలు చేశారు. SPY డిస్టిలరీల వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి రూ. 45 కోట్లు రుణాన్ని అందించాలని శ్రీధర్ రెడ్డి కోరగా.. దీని ప్రకారం, వారు అరబిందో గ్రూప్ కంపెనీల నుండి రూ. 45 కోట్ల రుణాన్ని అందించారు. జగన్ మోహన్ రెడ్డి, మిధున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, విజయ సాయి రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డిలతో కూడిన లిక్కర్ సిండికేట్‌కు 12% వడ్డీతో రుణాన్ని తిరిగి చెల్లించామని శ్రీధర్ రెడ్డి విచారణలో తెలిపారు. అరబిందో గ్రూప్ ఇచ్చిన రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి ఈ ఏర్పాటు చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర సిండికేట్ సభ్యుడిగా, మొత్తం నేరానికి కీలక సూత్రధారిగా, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్నారు.
ప్రముఖ మద్యం బ్రాండ్‌లను ఉద్దేశపూర్వకంగా అణిచివేసేందుకు, చట్టవిరుద్ధంగా ఆర్డర్ ఫర్ సప్లై (OFS) జారీ చేయడంలో కీలకపాత్ర పోషించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీలతో చురుకుగా సమన్వయం చేసి, సిండికేట్ సభ్యులకు సకాలంలో కిక్‌బ్యాక్‌లు చెల్లించేలా చూసారు. కసిరెడ్డి రాజ శేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగాడు. క్రమం తప్పకుండా వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్‌లకు వారు ఇష్టపడే కంపెనీలపై ఉంచవలసిన OFSపై ఆదేశాలు జారీ చేస్తూ వచ్చాడు. వాళ్ల డిమాండ్‌లు నెరవేర్చని పక్షంలో OFS ఇవ్వబడదని బెదిరించారు. మద్యం సరఫరా.. వాటి ద్వారా నగదు పంపిణీ సమాచారం మొత్తం శ్రీధర్ రెడ్డికి తెలిసే జరిగింది అని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
Also Read:
విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 07:54 PM