Hot Water Side Effects: మీకు ఈ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తాగడం మంచిది కాదు..
ABN , Publish Date - Apr 26 , 2025 | 07:37 PM
ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం ప్రయోజనకరం. కానీ, ఈ సమస్యలు ఉన్నవారు వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం ప్రయోజనకరం. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గడం, కడుపు క్లీన్ అవ్వడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను ఉన్నాయి. కానీ కొంతమందికి ఉదయం వేడినీరు తాగడం హానికరం కావచ్చు. వారు ఉదయం వేడినీరు తాగితే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పోషకాహార నిపుణుల ప్రకారం , ఉదయం వేడి నీరు తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కడుపు సమస్యలు:
మీకు కడుపు సమస్యలు ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో వేడినీరు తాగవద్దు. దీని వల్ల హాని జరగవచ్చు. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అంతేకాకుండా, ఉబ్బరం కూడా వస్తుంది. అల్సర్ ఉన్నవారు వేడినీరు, శీతల పానీయాలు తాగకూడదని నిపుణులు సలహా ఇస్తారు. అల్సర్లు ఉన్నవారు కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ఆల్కహాల్, ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలి.
యాసిడ్ రిఫ్లక్స్:
చాలా మంది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, వేడినీరు తాగడం మాంచిది కాదు. దీనివల్ల కడుపులోని ఆమ్లం ఆహార పైపులోకి చేరుతుంది. దీనివల్ల కడుపు నొప్పి రావచ్చు.
విరోచనాలు:
విరోచనాలు ఉన్నప్పుడు వేడి నీరు తాగడం మంచిది కాదు. వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, సరైన ఆహారం లేకపోవడం, మందుల దుష్ప్రభావాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఇది ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ లేదా అల్సరేటివ్ కొలిటిస్ సంభవించినట్లయితే మీరు తరచుగా టాయిలెట్‌కి వెళ్ళవలసి రావచ్చు. ఈ సమయంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర జీవక్రియ, ప్రేగు కదలిక పెరుగుతుంది. కాబట్టి, సాధారణ చల్లని నీరు తాగటం మంచిది.
Also Read:
పుచ్చకాయను వేరే పండ్లతో కలిపి తింటున్నారా..
రోడ్డు పక్కన జ్యూస్ తాగే ముందు జాగ్రత్త..
ఈ డ్రై ఫ్రూట్ తింటే మతిమరుపు రాదు..