Share News

Health Tips on Juice: రోడ్డు పక్కన జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:10 PM

సమ్మర్‌లో చాలా మంది రోడ్డు పక్కన ఉన్న స్టాళ్ల నుండి జ్యూస్ లేదా ఐస్ క్రీం తీసుకుంటారు. అయితే, అలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

Health Tips on Juice: రోడ్డు పక్కన జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..
Road Side Fruit Juice Shop

వేసవిలో చాలా మంది ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్ లను తాగుతుంటారు. ఎందుకంటే, ఇవి శరీరానికి ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా, అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. పుచ్చకాయ, మామిడి, ద్రాక్ష, నారింజ, ఇతర పండ్ల రసాలను కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకంటారు. అయితే, చాలా మంది ఎక్కువగా రోడ్డు పక్కన అమ్మే జ్యూస్ లను తాగుతుంటారు. కానీ, అలా రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్ జ్యూస్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కడుపు సంబంధిత సమస్యలు

రోడ్డు పక్కన ఉన్న ఫ్రూట్ షాప్‌లో జ్యూస్ తాగితే వాటి వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, రోడ్డుపై వెహికిల్స్ అదే పనిగా తిరుగుతుంటాయి. దాని నుండి వచ్చే దుమ్ము, ధూళి పక్కనే ఉన్న ఫ్రూట్స్‌పై పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, షాప్ నిర్వహకులు ఏ మాత్రం పరిశుభ్రత లేకుండా, నాణ్యత లేకుండా కూడా జ్యూస్ తాయారు చేసే అవకాశం ఉంటుంది. వాటిని మనం తీసుకోవడం వల్ల మోషన్స్, ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, రోడ్డు పక్కన ఉన్న షాప్‌లో జ్యూస్ తాగేటప్పుడూ జాగ్రత్తగా ఉండండి.

జాగ్రత్తగా ఉండాలి

వేసవిలో ఇటువంటి సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత లేదా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది ప్రమాదకరం. అలాగే, పేగు సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతాయి. పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని సరిగ్గా కడిగి తయారు చేసుకోవాలి. లేదంటే వాటిపై చల్లబడే రసాయనాలు ప్రమాదకరంగా మారవచ్చు. మరీ ముఖ్యంగా, రోడ్డు పక్కన వ్యాపారులు పరిశుభ్రత పాటించాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.


Also Read:

Viral Video On Tea: నీకేం పోయేకాలం తల్లీ.. టెంకాయ నీటిని ఇలా కూడా వాడుతారా..

Kailash Mansarovar: కైలాస పర్వతంపై ఆశ్చర్యపరిచే 5 మిస్టరీలు..

Somireddy : ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి

Updated Date - Apr 26 , 2025 | 03:14 PM