Virat Kohli-Anushka Sharma: ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?.. కారణం ఏంటో తెలిస్తే
ABN , Publish Date - Apr 26 , 2025 | 07:21 PM
సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలతో కలిసి భారత్ నుంచి వెళ్లిపోయారా? లండన్‌లో స్థిరపడ్డారా? అంటే కచ్చితంగా అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్ నటీమణి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే ఈ సంచలన విషయాన్ని బయట్టపెట్టారు.

సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) తమ పిల్లలతో కలిసి భారత్ నుంచి వెళ్లిపోయారా? లండన్ (London)లో స్థిరపడ్డారా? అంటే కచ్చితంగా అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్ నటీమణి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ ఈ సంచలన విషయాన్ని బయట్టపెట్టారు. వారి నిర్ణయం వెనుకున్న కారణాన్ని కూడా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. గతేడాది నుంచి అనుష్క తన పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటున్నట్టు సమాచారం. ఖాళీ దొరికినప్పుడల్లా కోహ్లీ లండన్ వెళ్లి వస్తున్నాడట.
గతేడాది కోహ్లీ తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌లో తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే కొందరు సన్నిహితులు కూడా కోహ్లీ ఫ్యామిలీ లండన్‌లో నివసిస్తున్నట్టు ధ్రువీకరించారు. వారి నిర్ణయం వెనుక గల కారణాన్ని తాజాగా డాక్టర్ శ్రీరామ్ వెల్లడించారు. తమ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి, పిల్లలను సాధారణంగా పెంచడం కోసం కోహ్లీ, అనుష్క కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. కోహ్లీ, అనుష్క భారత్‌లో స్వేచ్ఛగా, తమకు నచ్చినట్టు తిరగలేరు. సరదాగా బయట తిరగడం కుదరదు. అలాగే వారి పిల్లలకు కూడా భారత్‌లో ప్రైవసీ ఉండదు.
* అనుష్క, కోహ్లీ ఇక్కడ ఏమి చేసినా అది అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. వారు తమ పిల్లలను కెమెరాలకు దూరంగా సాధారణంగా పెంచాలనుకుంటున్నారు. వారి నిర్ణయాన్ని అభినందించాల్సిందే. ఒక సెలబ్రిటీగా నా భార్య (మాధురి) ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. కాబట్టి అనుష్క, కోహ్లీ సరైన నిర్ణయమే తీసుకున్నారని అనుకుంటున్నా * అని శ్రీరామ్ పేర్కొన్నారు. కోహ్లీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..