Palnadu District: తండ్రీకొడుకులు దారుణ హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు
ABN, Publish Date - Jul 23 , 2025 | 05:18 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
బాపట్ల, జులై 23: ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మాగులూరు శివారులో తండ్రీ కొడుకు దారుణ హత్యకు గురైన ఘటనలో ప్రధాని నిందితుడు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుడు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో విబేధాల కారణంగానే వీరిద్దరిని ప్రత్యర్థులు హత్య చేశారని పోలీసులు వివరించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు వద్ద తండ్రి కొడుకులు వీరాస్వామి రెడ్డి, ప్రశాత్ రెడ్డిని బుధవారం కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి.. కారులో తరలించారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న స్థానికులు చూసి.. ఆ కారును బైక్‌పై వెంబడించారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇక ఈ తండ్రీ కొడుకులను సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్దనున్న రియల్ ఎస్టేట్ వెంచర్‌లోకి తీసుకు వెళ్లి.. వారి గొంతు కోసం హత్య చేశారు.
ఇంతలో బైక్‌పై వచ్చిన స్థానికులతోపాటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ క్రమంలో వారంతా కలిసి.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని పట్టుకున్నారు. మరోవైపు గొంతు కోయడంతో ఆ తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత కుటుంబికులు.. ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ఈ ఘటనలో నిందితులు ఉపయోగించిన స్కార్పియో కారు టీజీ 08కె.. 2345ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక ఎవరెవరూ ఉన్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నీట్‌లో స్థానిక కోటాపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 23 , 2025 | 05:19 PM