Narendra Modi: పవన్ గొంతు జాగ్రత్త
ABN, Publish Date - May 03 , 2025 | 05:12 AM
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. పవన్ ప్రసంగం చేస్తున్నప్పుడు గొంతులో ఇబ్బంది వచ్చినప్పుడు మోదీ ఆయనకు విక్స్ ఇచ్చి గొంతు జాగ్రత్త వహించమని సూచించారు.
విక్స్ ఇచ్చిన మోదీ...
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమరావతి సభలో పవన్ ప్రసంగిస్తున్న సమయంలో కొంత ఇబ్బంది పడ్డారు. 11 నిమిషాల తన ప్రసంగంలో మధ్యలో రెండుసార్లు దగ్గుతూ ఇబ్బంది పడ్డారు. పవన్ గొంతు సవరించుకుని ప్రసంగం కొనసాగించడాన్ని ప్రధాని మోదీ గమనించారు. ప్రసంగం అనంతరం పవన్ తన సీట్లో కూర్చోబోతుండగా.. మోదీ పిలిచారు. ప్రసంగం బాగుందని అభినందనలు తెలుపుతూనే.. తన జేబులో ఉన్న విక్స్ తీసి పవన్ చేతుల్లో పెట్టారు. అలానే గొంతు జాగ్రత్త అని సూచించారు. ఆ సమయంలో పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ప్రధాని మోదీ తన పర్యటనల్లో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తుంటారు. ఆ సమయంలో ఇబ్బంది రాకుండా విక్స్‌ను వెంట పెట్టుకుంటున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు
Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Updated Date - May 03 , 2025 | 05:12 AM