ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: పార్లమెంటులో టీడీపీ ఎంపీల జోరు

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:41 AM

ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎన్నికైన ఎంపీలు తమ పార్లమెంటు హాజరులో, ప్రశ్నలు వేసే పనితీరులో, మరియు చర్చల్లో గణనీయంగా పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు వివిధ రకాలుగా ప్రతిభ చూపించారు.

99 శాతం హాజరుతో కలిశెట్టి, జీఎం హరీశ్‌ టాప్‌..చర్చల్లో లావు ఫస్ట్‌

54% హాజరుతో చివరిస్థానంలో వైసీపీ ఎంపీ అవినాశ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు పార్లమెంటుకు హాజరవుతున్న తీరు, సభలో వారు లేవనెత్తుతున్న ప్రశ్నలు, చర్చల్లో పాల్గొనడంపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 18వ లోక్‌సభ కొలువుదీరినప్పటి నుంచి ఇటీవల ముగిసిన బడ్జెట్‌ సమావేశాల వరకు ఎంపీల పనితీరుపై పీఆర్‌ఎ్‌సఇండియా.ఆర్గ్‌ సమాచారం సేకరించింది. దీని ప్రకారం.. టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, జీఎం హరీశ్‌ 99శాతం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌ (97ు), చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు (93ు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పార్లమెంటుకు 90 శాతానికి పైగా హాజరు ఏడుగురు ఎంపీలకు ఉండగా వారిలో ఆరుగురు (కలిశెట్టి, జీఎం హరీశ్‌, శ్రీభరత్‌, దగ్గుమళ్ల, బస్తీపాటి నాగరాజు, లక్ష్మీనారాయణ) తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనవారే కావడం విశేషం. ఈ జాబితాలో 54 శాతం హాజరుతో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి చివరి స్థానంలో ఉన్నారు. ఇక ప్రశ్నలు వేయడంలోనూ ఎంపీ కలిశెట్టి ముందున్నారు. ఏకంగా 89 ప్రశ్నలు ఆయన వేశారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి (84), దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, పుట్టా మహేశ్‌(82) వరుసగా రెండు,మూడు స్థానాల్లో నిలిచారు. తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అత్యల్పంగా 22 ప్రశ్నలు అడిగారు. టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు 22 చర్చల్లో పాల్గొని టాప్‌లో ఉండగా, వైసీపీ ఎంపీ గురుమూర్తి 19 చర్చలతో రెండోస్థానంలో, జనసేన ఎంపీ బాలాశౌరి 18చర్చలతో మూడోస్థానంలో ఉన్నారు. ఎంపీ పార్థసారథి కేవలం ఒక్కచర్చలో మాత్రమే పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:41 AM