ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌ శుభాకాంక్షలు

ABN, Publish Date - Apr 29 , 2025 | 04:33 AM

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ పురస్కారం స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందన్నారు. ప్రజాసేవలో, కళాసేవలో బాలకృష్ణ మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించిన తమిళ నటుడు అజిత్‌కు కూడా పవన్‌ అభినందనలు తెలిపారు.


మరెన్నో విజయాలు సాధించాలి: అచ్చెన్న

మరోవైపు బాలకృష్ణ పద్మభూషణ్‌ అందుకోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ వారసుడిగా సినీరంగంలో అడుగుపెట్టి, తనదైన ముద్ర వేస్తూ.. తల్లి బసవతారకం స్మారకంగా క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 29 , 2025 | 04:34 AM