ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు

ABN, Publish Date - Jun 28 , 2025 | 06:02 AM

వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్‌ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది.

  • బాణసంచా కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్‌ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

లోకేశ్‌ ఫిర్యాదు ఆధారంగా లక్కిరెడ్డిపల్లె పోలీసులు ఈనెల 25న కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, మరో 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాయి రోహిత్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Jun 28 , 2025 | 06:02 AM