ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి

ABN, Publish Date - May 01 , 2025 | 03:52 PM

Chandrababu MSME Parks: నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

Chandrababu MSME Parks

నెల్లూరు, మే 1: జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (గురువారం) ప్రారంభించారు. వర్చువల్‌గా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం మొదలుపెట్టారు. 14 ఎఫ్‌ఎఫ్‌సీలు, 25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఏపీలో అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని... అందులోనూ వ్యవసాయం మీద అత్యధికంగా ఆధారపడ్డారన్నారు. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికుల బాధలు చూశానని... మిట్టమధ్యాహ్నం వేళ కాలే ఇనుప కమ్మిలతో పనిచేస్తున్నారని.. వారందర్నీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. టీడీపీ సింబల్‌లో పేదలకు గుర్తుగా ఇళ్లు, రైతులకు గుర్తుగా నాగలి, కార్మికులకు గుర్తుగా చక్రం ఉంటుందని.. ఆ చక్రం దేశంలోని ఏ పార్టీ సింబల్‌లో ఉండదన్నారు.


వారిని కోటీశ్వరులను చేయాలనుకున్నాం

గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితం చేశామని... భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం భవన అనుమతులు తేలికగా పొందే వీలు కల్పించామన్నారు. నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 34వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరులని చేయాలనుకున్నామన్నారు. 29 వేల మంది రైతులు భూములిచ్చారని.. ఎక్కడా రైతుకి అన్యాయం జరగకుండా చూసిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. కొందరికి అభివృద్ది జరగకూడదని... పుల్లలు పెడుతుంటారని మండిపడ్డారు.

Revanth On Caste Census: మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి.. కేంద్రానికి రేవంత్ సూచన


భవిష్యత్తు ఏఐ దే

నెల్లూరు జిల్లాలో తరతరాలుగా యానాదులు పేదరికంలో ఉన్నారన్నారు. ఏపీలో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా ఎదుగుతాయన్నారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఇక్కడి నుంచే ప్రారంభించామని.. మండలానికో ఎంఎస్‌ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉందని... భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని చెప్పుకొచ్చారు. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతరం కేంద్రంగా అయిదు రీజనల్ హబ్‌లు పెడుతున్నామన్నారు. పరిశ్రమలను విద్యాసంస్థలను అనుసంధానం చేయబోతున్నామన్నారు. యువత అందరికీ మంచి ఆలోచనలు ఉన్నాయన్నారు. ఉద్యోగం పొందడం కాదని, ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని సూచించారు. ఐటీ వల్ల ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు బిడ్డలు ఉన్నారని... ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని సీఎం ఆకాంక్షించారు.


ఆ బాధ్యత ఆనం దే

పరిశ్రమలకు లోన్లు, అనుమతులు వంటివి సింగిల్ విండో ద్వారా త్వరగా ఇస్తామన్నారు. ప్లగ్ అండ్ ప్లే... ఎంఎస్‌ఎంఈలో అన్ని సిద్ధంగా ఉంటాయన్నారు. యంత్రాలు తెచ్చుకుంటే చాలన్నారు. ఫ్లడెడ్ ఫ్యాక్టరీ ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలను సూచించారు. ఇక్కడ ఎంఎస్‌ఎంఈలో పరిశ్రమలు ఏర్పాటు చేయించే బాధ్యత ఆనం రామనారాయణరెడ్డిదే అని అన్నారు. రైతులను పారిశ్రామికవేత్తలని చేయాలని.. భూమి మీది అని.. మీరూ నానో పార్కులు తీసుకుని పరిశ్రమలు పెట్టాలని కోరారు. ఆడబిడ్డలు బాగా చదువుకున్నారని... మీరు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


ఇంకా పరిశ్రమలు వస్తాయ్

ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా కూడా నా రాజధాని అమరావతి అని చెప్పుకోవాలన్నారు. దగదర్తిలో త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తామన్నారు. పోర్టులు, రైల్వే లైన్లు, నేషనల్ రోడ్లు, పరిశ్రమలు వస్తుంటే ఇంకేమి కావాలన్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు వచ్చాయని... ఇంకా పరిశ్రమలు వస్తాయన్నారు. సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు. శ్రీశైలం నీటిని నెల్లూరుకు ఇచ్చిన తరువాతే తమిళనాడుకు వెళ్లాలని ఎన్టీఆర్ పట్టుబట్టారన్నారు. అందుకే సోమశిలకి నీరొస్తుందన్నారు. కండలేరు కూడా ఆయనే నిర్మించారని తెలిపారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ది జరుగుతందన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఫించన్లు ఇస్తున్నామన్నారు. మొదట పించన్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దివ్యాంగులపై అత్యంత ప్రేమ చూపిన పార్టీ టీడీపీ, ఎన్డీఏ అని చెప్పుకొచ్చారు. ఒక ప్రాంతంలో వంద మంది ఉంటే, బాగా పేదరికంలో ఉన్నవారి బాధ్యతను ఆర్ధికంగా అభివృద్ది చెందిన ఇరవై మంది అన్నీ చూసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2025 | 04:59 PM