ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

ABN, Publish Date - May 01 , 2025 | 07:02 AM

సీఎం చంద్రబాబు గురువారం నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పాళెం గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ, మేడే సందర్భంగా కార్మికులతో ముచ్చటిస్తారు. అలాగే ఏపీఐఐసీకి చెందిన ఎంఎస్​ఎంఈ ప్రాజెక్టులు పరిశీలిస్తారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసిన ఎంఎస్​ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారు.

CM Chandrababu Naidu

నెల్లూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. (Nelore Dist. Visit) ఎన్టీఆర్ భరోపా పింఛన్ (NTR Pension Scheme), ఆత్మకూరు (Atmakur) నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండో సారి ముఖ్యమంత్రి ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తున్నారు. అభివృద్దే ధ్యేయంగా చంద్రబాబు పర్యటన సాగుతుంది. పాళెం గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ, మేడే సందర్భంగా కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తారు. అలాగే ఏపీఐఐసీకి చెందిన ఎంఎస్​ఎంఈ ప్రాజెక్టులు పరిశీలిస్తారు. యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసిన ఎంఎస్​ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి ఆత్మకూరు నుంచే ప్రారంభిస్తారు.


సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్..

గురువారం ఉదయం 11.30 గంటలకు బాలికల గురుకుల పాఠశాల ఆవరణలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.50 గంటలకు నెల్లూరు పాళెం గిరిజన కాలనీలో ఎన్టీఆర్ భరోపా పింఛన్ల పంపిణీలొ పాల్గొంటారు. 12.10 గంటలకు ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నారంపేట ఎంఎస్ఎంఈ పార్కును ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించనున్నారు. 1.30 గంటల నుండి 3 గంటల వరకు ప్రజావేదికలో స్థానికులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. 3.05 గంటల నుంచి 4.35 గంటల వరకు టిడ్కో సమీపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 4.40 గంటలకు హెలీఫాడ్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.

Also Read: బంగారం కొనుగోళ్లలో అదే జోరు..


గట్టి బందోబస్తు..

సీఎం చంద్రబాబు నెల్లూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జి.కృష్ణకాంత్‌ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 73 మంది ఎస్ఐలు, 149 ఏఎస్ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 267 మంది కానిస్టేబుళ్లు, 67 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 07:02 AM