ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Gottipati Ravi Kumar: విద్యుత్‌ ఒప్పందాలపై అసత్య ప్రచారం

ABN, Publish Date - May 06 , 2025 | 05:44 AM

విద్యుత్‌ ఒప్పందాలపై జగన్మోహన్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలను ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఖండించారు. యాక్సిస్‌తో ఒప్పందం రాష్ట్రానికి అన్ని విధాలా మేలే అని తెలిపారు.

  • యాక్సి్‌సతో రాష్ట్రానికి అన్ని విధాలా మేలే: మంత్రి గొట్టిపాటి

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): యాక్సిస్‌ సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై జగన్‌ పత్రిక అసత్య ప్రచారాలు చేస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రజలను జగన్‌ తప్పుదోవపట్టిస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వైసీపీ హయాంలో యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.49కే కొనుగోలు చేశామని జగన్‌ ప్రచారం చేస్తున్నాడని, అయితే అప్పుడు యూనిట్‌ రూ.5 కంటే ఎక్కువకే కొన్నారని పేర్కొన్నారు. యాక్సి్‌సతో ఒప్పందం వందశాతం సక్రమమని, దీనిపై వైసీపీ అబద్దాలాడుతోందని తెలిపారు. యాక్సిస్‌ కంపెనీ సోలార్‌తోపాటు బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టునూ నిర్వహిస్తుందని.. దీని ద్వారా ప్రజావసరాల మేరకు మాత్రమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని తెలిపారు. యాక్సి్‌సతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి అన్నివిధాలా మేలేనన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ఠస్థాయిలో ఉన్న సమయంలో యూనిట్‌కు రూ.10 వరకూ చెల్లించి కొనాల్సి వస్తోందని, యాక్సి్‌సతో యూనిట్‌ రూ.4.65కే లభించనుందని తెలిపారు.

Updated Date - May 06 , 2025 | 05:45 AM