Mega DSC: ముగిసిన మెగా డీఎస్సీ పరీక్షలు
ABN, Publish Date - Jul 03 , 2025 | 06:52 AM
మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది జూన్ 6న ప్రారంభమైన పరీక్షలు 23 రోజుల పాటు సాగి బుధవారం ముగిశాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
91.72శాతం హాజరు
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది జూన్ 6న ప్రారంభమైన పరీక్షలు 23 రోజుల పాటు సాగి బుధవారం ముగిశాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 91.72 శాతం మంది హాజరయ్యాన్నారు. చివరి రోజు ఎస్జీటీ తెలుగు పరీక్షకు 19,879 మంది దరఖాస్తు చేసుకోగా 19,409 (97.06శాతం) మంది హాజరయ్యారన్నారు. డీఎస్సీపై ఇతరత్రా సందేహాలకు వెబ్‌సైట్‌లో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Jul 03 , 2025 | 06:52 AM