Mega DSC 2025: డీఎస్సీకి 90.14 శాతం హాజరు
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:36 AM
మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌లో 9,951 మంది అభ్యర్థులకు గాను...
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌లో 9,951 మంది అభ్యర్థులకు గాను 9,516 (95.63శాతం) మంది, మధ్యాహ్నం సెషన్‌లో 17,301 మందికి గాను 15,051 (87శాతం) మంది హాజరయ్యారని వివరించారు. మొత్తంగా 90.14 శాతం మంది పరీక్షలు రాశారని చెప్పారు. ఉదయం అత్యధికంగా కర్నూలులో 98.35శాతం, మధ్యాహ్నం అత్యధికంగా అనంతపురంలో 89.79 శాతం మంది హాజరయ్యారని కన్వీనర్ పేర్కొన్నారు.
Updated Date - Jun 09 , 2025 | 04:37 AM