ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: విశాఖలో దారుణం.. వైస్ ప్రిన్సిపాల్ చూశాడని ఓ విద్యార్థి..

ABN, Publish Date - Apr 19 , 2025 | 05:26 PM

విశాఖ నగరంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఘోరం జరిగింది. మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు..

Andhra Pradesh

విశాఖపట్నం, ఏప్రిల్ 19: విశాఖ నగరంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఘోరం జరిగింది. మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్‌లో స్లిప్‌లు పెట్టుకుని రాస్తుండగా.. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో అవమాన భారంతో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


విజయవాడకు చెంది శ్రీరామ్ దత్త ప్రణీత్(23) భీమిలి సంగివలస ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీఏ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామ్ స్లిప్పులు పెట్టుకుని సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అవమానంగా భావించిన శ్రీరామ్.. కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని భీమిలి పోలీసులకు తెలియజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. శ్రీరామ్ మృతదేహాన్ని పరిశీలించి.. కాలేజీ మార్చురీలోనే వుంచారు.


వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా..

ఇదిలాఉంటే శ్రీరామ్ మృతికి వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

రాజస్తాన్ రాత మారేనా

నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 19 , 2025 | 09:14 PM