ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kommareddy Pattabhiram: లిక్కర్‌ స్కాంలో సూత్రధారి తాడేపల్లి బిగ్‌బాస్‌

ABN, Publish Date - Jun 02 , 2025 | 04:28 AM

ఏపీ లిక్కర్ స్కాంలో తాడేపల్లి బిగ్‌బాస్ కీలక సూత్రధారి అని కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దర్యాప్తులో జగన్‌కు అనుయాయుల పక్కన ఉన్న ఆధారాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు.

దర్యాప్తులో ఆధారాలన్నీ జగన్‌ వైపే: పట్టాభిరాం

కడప మారుతీనగర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ లిక్కర్‌ స్కాంలో ప్రధాన సూత్రధారి తాడేపల్లి బిగ్‌బాస్‌ అని.. దర్యాప్తులో అన్ని వేళ్లూ ఆయన వైపే చూపుతున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో పలు విషయాలు బయటపడుతున్నాయని, మాజీ సీఎం జగన్‌కు కళ్లు, చెవులుగా వ్యవహరిస్తున్న కీలక వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారని అన్నారు. మహానాడు జరిగిన ప్రదేశాన్ని ఆదివారం ఆయన సందర్శించి అక్కడున్న వ్యర్థాలను కార్పొరేషన్‌ సిబ్బందితో శుభ్రం చేయించే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ... లిక్కర్‌ స్కాంలో దొరికిన జగన్‌ అనుయాయులు బిగ్‌బాస్‌ పేరు చెప్పేందుకు భయపడుతున్నారని అన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా సిట్‌ దర్యాప్తు బృందం తాడేపల్లి ప్యాలె్‌సకు చేరుకోనుందని చెప్పారు. బిగ్‌బా్‌సను పట్టుకునేందుకు పోలీసులు తాడేపల్లి గోడలు దూకరని, చట్టవ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించరని అన్నారు. జగన్‌ అర్ధరాత్రి ధైర్యంగా నిద్రపోవచ్చని చెప్పారు. దర్యాప్తు చట్టప్రకారం జరుగుతుందని తెలిపారు. కాగా.. కడపలో నిర్విహించిన టీడీపీ మహానాడు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని.. అది చూసి వైపీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిందని పట్టాభి వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, మంత్రి లోకేశ్‌పైనా విషప్రచారం చేస్తున్నారన్నారు. కడపలో నిర్వహించిన మహానాడు ప్రదేశంలో ఎటువంటి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయాలని సీఎం, మంత్రి లోకేశ్‌ చెప్పడంతో ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 04:29 AM