ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh liquor policy: ఖజానాకు కిక్కు

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:08 AM

జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం పాలసీ వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయిందని పేర్కొన్న కూటమి ప్రభుత్వం, ప్రైవేటు పాలసీ అమలు చేసి మద్యం ఆదాయాన్ని రూ.28,842 కోట్లకు పెంచింది. నాణ్యమైన బ్రాండ్ల అందుబాటుతో అమ్మకాలు 9.1 శాతం పెరిగాయి.

2024-25లో 28,842 కోట్ల మద్యం రాబడి

ఏడాదిలో 14@ వృద్ధి

గతేడాది కంటే 3,760 కోట్లు ఎక్కువ

2023-24లో ఆదాయం 25,082 కోట్లు

నాడు కమీషన్లు, జే బ్రాండ్లతో దోపిడీ

ఐదేళ్లలో 18 వేల కోట్ల ఆదాయానికి కోత

కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్‌

రాబడిపై ‘క్వార్టర్‌ రూ.99’ ఎఫెక్ట్‌

వచ్చే సెప్టెంబరులో బార్‌ పాలసీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

త జగన్‌ సర్కారు ‘ప్రభుత్వ మద్యం పాలసీ’తో ఆదాయానికి గండికొడితే.. కూటమి ప్రభుత్వం అక్రమాలకు అడ్డు కట్ట వేసి ఆదాయం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంది. 2023-24లో మద్యంపై రూ.25,082 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది 14 శాతం పెరిగి రూ.28,842 కోట్లకు ఆదాయం చేరింది. గత ప్రభుత్వంలోనూ ఇదే తరహా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేసి మద్యం పాలసీని అస్తవ్యస్తం చేసింది. రాష్ట్రంలో నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచకపోవడంతో ఐదేళ్లలో రూ.18 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ పాలసీ స్థానంలో తిరిగి ప్రైవేటు పాలసీ ప్రవేశపెట్టి కమీషన్లకు చెక్‌ పెట్టింది. కమీషన్లు ఇచ్చే అవసరం లేకపోవడంతో మద్యం కంపెనీలు స్వచ్ఛందంగా ధరలు తగ్గించుకున్నాయి. మరోవైపు జాతీయ కంపెనీలు తయారు చేసే క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యల వల్ల పిచ్చి బ్రాండ్లు కనుమరుగవడంతో పాటు భారీగా ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్‌ శాఖకు ఆదాయ లక్ష్యం మరింత పెరిగింది. 2024-25లో పరిమాణం(సీసాలు) పరంగా చూస్తే అమ్మకాలు 9.1 శాతం పెరిగాయి. 2023-24లో 4.55 కోట్ల కేసుల మద్యం అమ్మితే, 2024-25లో 4.97 కోట్ల కేసుల మద్యం అమ్మారు. లిక్కర్‌లో 7.38 శాతం, బీరులో 14.13 శాతం అమ్మకాలు పెరిగాయి.

గత ప్రభుత్వంలో మద్యం కంపెనీల నుంచి కమీషన్లు!

ఒక్కో మద్యం బాక్సుపై రూ.150 నుంచి 450 వరకు దోపిడీ! దీనికి తోడు ఊరూ పేరూ లేని ‘జే బ్రాండ్ల’ రుద్దుడు! తద్వారా సర్కారు ఖజానాకు గండి కొట్టి వైసీపీ పెద్దలు వేల కోట్లు దోచుకున్నారు!

ఇప్పుడు కమీషన్లు లేవు. ‘జే బ్రాండ్ల’ బెడద లేదు. ఫలితంగా సర్కారుకు ఆదాయం పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.3,760 కోట్ల మేర రాబడి పెరిగింది.


ఆదాయం ఇలా..

మద్యంపై వచ్చే పన్నుల రూపంలో రూ.24,731 కోట్లు

షాపులు, బార్లు, డిస్టిలరీల లైసెన్స్‌ ఫీజుల రూపంలో రూ.2,206 కోట్లు

షాపుల దరఖాస్తు రుసుముల రూపంలో రూ.1,905 కోట్లు

ఫలితాలిస్తున్న చర్యలు

రాష్ర్టాన్ని నాటు సారా రహితం చేసే లక్ష్యంతో ప్రభుత్వం నవోదయం 2.0 ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,571 గ్రామాల్లో నాటు సారా ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రామాల్లో నాటు సారానూ పూర్తిగా నిర్మూలించి నాటు సారా రహిత ఏపీగా ప్రకటించనున్నారు. తిరుపతి, నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను త్వరలో నాటు సారా రహిత జిల్లాలుగా ప్రకటించనున్నారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ముమ్మరంగా దాడులు నిర్వహిస్తోంది. సరిహద్దు ప్రాంతాలలో పొరుగు రాష్ర్టాల సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దాడులు చేస్తున్న చోట్ల మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. మద్యంతో పోలిస్తే నాటు సారా ధర తక్కువ కావడంతో కొందరు దాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తూ, దాని వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తున్నారు. నాటు సారా అందుబాటులో లేని చోట్ల మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. అలాగే పక్క రాష్ర్టాల నుంచి వచ్చే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌కు కూడా చాలా వరకు అడ్డుకట్ట పడింది. ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి.


రూ.99 మద్యానికి డిమాండ్‌

అధికారంలోకి వచ్చాక తక్కువ ధరలతో మద్యం అందుబాటులో ఉంచుతామని కూటమి హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా జాతీయ కంపెనీలు ఉత్పత్తి చేసే మద్యాన్ని క్వార్టర్‌ రూ.99కు అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 కంపెనీలు ఈ రకం మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. క్వార్టర్‌ రూ.99 అమ్మకాలు ప్రారంభించిన సమయంలో అమ్మకాల్లో వాటి వాటా 30 శాతానికి చేరింది. గత ప్రభుత్వంలో పిచ్చి పిచ్చి ‘జే’ బ్రాండ్లను ఎక్కువ ధరలకు అమ్మేవారు. ఇప్పుడు తక్కువ ధరలో లభిస్తున్న క్వార్టర్‌ రూ.99కు డిమాండ్‌ పెరిగింది. అయితే వీటి అమ్మకాలు పెరుగుతున్నా విలువ (అమ్మకాల మొత్తం) తగ్గుతోంది. అమ్మకాలకు తగినట్టుగా ఆ మేరకు ఆదాయం రావడం లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఈ బ్రాండ్ల మద్యాన్ని కొంతమేర నియంత్రిస్తున్నారు. ఇటీవల క్వార్టర్‌ రూ.99 బ్రాండ్ల అమ్మకాల మార్కెట్‌ 20 శాతానికి తగ్గింది. నాటు సారా ప్రభావిత, గ్రామీణ ప్రాంతాలకు ఈ బ్రాండ్లను పరిమితం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తక్కువ ధర బ్రాండ్లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచితే అటు వినియోగదారులకు, ఇటు ప్రభుత్వ ఆదాయానికి అనుకూలంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.


కొత్త బార్‌ పాలసీ

ఈ ఏడాది ఆగస్టుతో ప్రస్తుత బార్‌ పాలసీ ముగుస్తుంది. దీంతో కొత్త బార్‌ పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 870 బార్లు ఉన్నాయి. వాటిలో 42 బార్లు ఎవరూ తీసుకోకపోవడంతో ఖాళీగా మిగిలాయి. గత ప్రభుత్వం బార్లను వేలం విధానంలో కేటాయించింది. ఈసారి వేలం పెట్టాలా? లేదా లాటరీ ద్వారా ఎంపిక చేయాలా? అనేదానిపై కసరత్తు జరుగుతోంది. వచ్చే సెప్టెంబరులో కొత్త బార్‌ పాలసీ అమల్లోకి రానుంది. పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా ఇటీవల 37 స్టార్‌ హోటళ్లలోని బార్లకు లైసెన్స్‌ ఫీజులు తగ్గించారు. దీంతో సుమారు రూ.12 కోట్ల ఆదాయం తగ్గే పరిస్థితి వచ్చింది. అమ్మకాలు పెరిగితే పన్నుల రూపంలో ఆ మేరకు ఆదాయం సర్దుబాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:08 AM