ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:26 PM

Butta Renuka: వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకను బిగ్ షాక్ తగింది. ఆమె ఆస్తులను వేలం వేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఆస్తులను వేలం వేయగా.. ఎవరు రాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది.

YCP Ex MP Butta Renuka

కర్నూలు, ఏప్రిల్ 26: ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి అనుబంధ విభాగం ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ.310 కోట్లు అప్పును వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతులు తీసుకున్నారు. అయితే వాటిని ఈ దంపతులు తిరిగి చెల్లించ లేదు. దీంతో వారి ఆస్తులను వేలం వేసే దిశగా అడుగులు సాగుతోన్నాయి. కొంత కాలం పాటు కిస్తీలు సక్రమంగానే వీరు చెల్లించారు. కానీ గత ఐదేళ్లగా వీరు ముఖం చాటేశారు. సంస్థ ప్రతినిధులు పలుసార్లు నోటీసులు పంపి.. వారితో చర్చించింది. కానీ అవి విఫలమయ్యాయి. దీంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ చర్యలు చేపట్టింది.

బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠలు 2018లో 15 ఏళ్ల కాలవ్యవధిలో తిరిగి చెల్లించేలా రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్, మెరిడియన్‌ ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు ఆ రుణాన్ని వినియోగించారు. ఈ రుణంపై సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించారు. అసలు,వడ్డీ కలిపి ఇంకా రూ. 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.


వడ్డీ భారం ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూలు చేయాలని వారు కోరారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రతిపాదన ఉందని హెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రతినిధులు అంగీకరించ లేదు. ఆ క్రమంలో పలు ప్రతిపాదనలను సంస్థ ప్రతినిధుల ఎదుట ఆ దంపతులు ఎదుట ఉంచారు. అందుకు వారు సమ్మతించలేదు.


దీంతో బుట్టా రేణుక దంపతులకు చెందిన బంజారాహిల్స్‌లోని ఐదువేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మాదాపూర్‌లోని 7,205 చ.గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్‌ వేలానికీ సైతం స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఈ ఆస్తులను మరోసారి వేలానికీ ప్రయత్నిస్తున్నారు. వీరి ఆస్తులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భయంతో ఎవరు ముందుకు రావడం లేదనే ఓ చర్చ సైతం సాగుతోంది.

ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: ముమ్మర తనిఖీలు.. పోలీసులు అదుపులో 400 మంది

Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..

Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 12:29 PM