Pahalgam Terror Attack: మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:17 AM
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను ఇప్పటికే భద్రతా బలగాలు పేల్చేశాయి. ఈ రోజు మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను సైతం భద్రతా బలగాలు పేల్చేశాయి. దీంతో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశినట్లు అయింది.
శ్రీనగర్, ఏప్రిల్ 26: పహల్గాంలో ఉగ్రదాడి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతోంది. ఆ క్రమంలో పహల్గాం ఉగ్రదాడితో సంబంధమున్న మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. పుల్వామాలో ఎసాన్ ఉల్, షోపియాన్‌లో షబీర్ అహ్మద్‌తోపాటు కుల్గాంలో జకీర్ గని ఇళ్లను పేల్చిశాయి. దీంతో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఇళ్లు పేల్చివేశారు. 2018లో ఉగ్రవాది అదిల్..అటారీ వాఘా సరిహద్దు ద్వారా అధికారికంగా భారత్‌లో ప్రవేశించాడని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాంలో ఉగ్రదాడి ప్రణాళిక రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడని తెలిపాయి.
మరోవైపు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా అణువణువు క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. అందులోభాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు చెబుతోన్నాయి. అంతేకాదు.. వీరిద్దరు ఉగ్రవాద కార్యకలాపాల్లో సైతం పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంకోవైపు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఇప్పటికే విడుదల చేశారు. వారి ఆచూకీ తెలియజేస్తే.. రూ. 20 లక్షలు బహుమతిగా అందజేస్తామని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనపై బారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకొంది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు వారికి 48 గంటల గడువు విధించింది.
ఇక న్యూఢిల్లీలోని పాక్ రాయబారిని సైతం దేశం వదిలి వెళ్లాలని సూచించింది. అందుకు వారికి వారం గడువు విధించింది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. మరోవైపు పాకిస్థాన్ సైతం ఇదే రీతిలో స్పందించింది. భారత్‌తో చేసుకొన్న సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే భారత్‌కు చెందిన విమానాలు తమ దేశ గగన తలంలో విహరించరాదని పాక్ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..
Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Virginia Giuffre: వర్జీనియా గియుఫ్రే ఆత్మహత్య
For National News And Telugu News