BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన
ABN, Publish Date - May 01 , 2025 | 10:01 AM
BC Janardhan: అకాల వర్షాలతో పంట నేలరాలడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆవేదన చెందారు. అకాల వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అధికారులతో చర్చించారు.
నంద్యాల, మే 1: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు (Farmers) రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) భరోసా ఇచ్చారు. జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో అకాల వర్షాలు, గాలి వానతో చేతికొచ్చిన పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, గాలివానతో నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఏపీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమై ఉన్నప్పటికీ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పట్ల తక్షణమే స్పందించారు మంత్రి.
వెంటనే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అకాల వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 500 ఎకరాల్లో వరి, 100 ఎకరాలకు పైగా జొన్న పంట నీట మునగడంపై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వ్యవసాయంతో పాటు హర్టికల్చర్‌కు సంబంధించిన పంట నష్టంపై కూడా త్వరితగతిన అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షం, గాలివానతో నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ తీగలు తెగి పడటంతో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
May Day wishes: కార్మికులకు సీఎం చంద్రబాబు, లోకేష్ మేడే శుభాకాంక్షలు
కుండపోత వర్షాలు, ఈదురుగాలులకు భారీ చెట్లు నేలకొరగడం.. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో తీవ్ర ట్రాఫిక్ నెలకొంది. ఈ విషయాన్ని ఆర్ అండ్ బీ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు మంత్రి. తక్షణమే రోడ్లకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని క్షేత్రస్థాయి అధికారులను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
CM Revanth Reddy: కార్మికలోకానికి ‘మే’డే శుభాకాంక్షలు
Head Injury: తలకు దెబ్బ తగిలిందా? ఈ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి
Read Latest AP News And Telugu News
Updated Date - May 01 , 2025 | 10:01 AM