Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - May 02 , 2025 | 12:42 PM
Suresh Productions: సుప్రీం కోర్టులో సురేష్ ప్రొడక్షన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని.. మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చిచెప్పేసింది ధర్మాసనం.
న్యూఢిల్లీ , మే 2: సురేష్ ప్రొడక్షన్స్‌కు (Suresh Production) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించలేదు. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై ఈరోజు (శుక్రవారం) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని గతంలో జగన్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ సవాల్ చేసింది. దీనిపై ఈరోజు విచారణకు రాగా.. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా ధర్మాసనం విచారణ జరిపింది.
అయితే పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం అడుగుతున్నారని.. అది కుదరదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పేసింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని అభయ్ ఒకా సూచించారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ తెలుపగా.. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది.
Jagan Batch High Court: మద్యం కుంభకోణం కేసులో ఆ ముగ్గరికి ఎదురుదెబ్బ
కాగా.. విశాఖలో సురేష్ ప్రొడక్షన్స్‌కు ఫిల్మ్‌సిటీ కోసం కేటాయించి భూములను ఇతర అవసరాలకు వాడేందుకు గత వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వైసీపీ సర్కార్ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని గుర్తించింది. దీంతో సురేష్ ప్రొడెక్షన్స్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సురేష్ ప్రొడక్షన్స్‌కు కూటమి సర్కార్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులపై సుప్రీంను సురేష్ ప్రొడక్షన్స్ ఆశ్రయించింది. అయితే విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. షోకాజు నోటీసులపై మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో తన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు సుప్రీం కోర్టుకు సురేష్ ప్రొడక్షన్స్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
Kesireddy SIT Custody: రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్
Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 01:27 PM