Share News

Kesireddy SIT Custody: రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

ABN , Publish Date - May 02 , 2025 | 12:17 PM

Kesireddy SIT Custody: ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

Kesireddy SIT Custody: రాజ్ కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్
Raj Kesireddy SIT Custody

విజయవాడ, మే 2: మద్యం కుంభకోణం కేసులో (Liquor Scam Case) ప్రధాన నిందితుడి ఉన్న రాజ్ కసిరెడ్డిని (Raj Kesireddy) సిట్ అధికారులు (SIT Officers) కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన సిట్ అధికారులు విచారణ నిమిత్తం కసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత సిట్ కార్యాలయానికి కసిరెడ్డిని తరలించారు. సిట్ కార్యాలయంలో రాజ్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు.


నేటి నుంచి వారం రోజుల పాటు విచారణ నిమిత్తం కస్టడీలోకి ఇస్తూ కోర్టు నిన్న(గురువారం) ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో వేలకోట్లు చేతులు మారాయని ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఈమొత్తం వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఆదేశాలతో మద్యం పాలసీ రూపకల్పన కోసం మొదలైన సమావేశం దగ్గర నుంచి ప్రభుత్వం కూలిపోయే వరకు కూడా మొత్తం మద్యం తయారీ, డిస్ట్లరీ కంపెనీలకు అనుమతులు, తద్వారా వచ్చే నెలవారీ మమూళ్లు అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్లు గుర్తించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయడంతో పాటు దాదాపు పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి అవడంతో వారం రోజుల పాటు కసిరెడ్డిని కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించి తర్వాత జిల్లా జైలులో అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈరోజు కసిరెడ్డిని జిల్లా జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత సిట్ కార్యాలయానికి తరలించారు.

Jagan Batch High Court: మద్యం కుంభకోణం కేసులో ఆ ముగ్గరికి ఎదురుదెబ్బ


మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది.. ఎవరి ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు అనేదానిపై లోతైన విచారణ చేయనున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచే ఈ వ్యవహారం నడిచిందని ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్‌లో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఆ రోజు వైసీపీ పెద్దలుగా ఉన్న వారు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తే కసిరెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపారు అనేది నిర్ధారించనున్నారు.


ఇక ఇప్పటికే ఈ కేసులో నిన్న (గురువారం) మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కసిరెడ్డికి పీఏగా ఉన్న పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ పారిపోయేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లిన దిలీప్‌ను సిట్ అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. దిలీప్ చెప్పే అంశాల ఆధారంగా ఈ వారం రోజుల కస్టడీలో కసిరెడ్డి నుంచి మరింత సమాచారాన్ని సేకరించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల కస్టడీ తర్వాత రాజ్ చెప్పే అంశాలను బట్టి మరింత లోతైన దర్యాప్తు ద్వారా పురోగతి సాధించే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

Amaravati Restart Event: అమరావతి బహిరంగ సభ.. సీమ ప్రజలకు తప్పని తిప్పలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 01:14 PM