ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామం

ABN, Publish Date - May 07 , 2025 | 01:02 PM

పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. భారత్‌ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు.

Pawan Kalyan

అమరావతి: పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని హిందువు, ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌‌ (operation sindoor)పై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడిని స్వాగతించినట్లు చెప్పారు. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి... ఆపరేషన్‌ సిందూర్‌తో తిరిగి వీరత్వాన్ని నింపిందని కొనియాడారు. త్రివిధ దళాధిపతులు, ప్రధాని మోదీకి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీకి చెందిన ఇద్దరు కుటుంబాలతో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని ఉగ్రవాదులు చంపేశారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి బారత్ సేనలు పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలనుధ్వంసం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. పాక్‌లో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలకకుండా, ప్రాణ నష్టం జరగకుండా.. కేవలం ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

Also Read: పహల్గామ్ దాడిలో మరో కుట్ర..


పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠం..

పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్‌ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. భారత్‌ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు కేంద్రానికి మద్దతుగా నిలవాలని పిలుపిచ్చారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని పవన్ కల్యాణ్ విమర్శించారు.


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్..


ఈ వార్తలు కూడా చదవండి..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

Rahul Gandhi: సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నా..

For More AP News and Telugu News

Updated Date - May 07 , 2025 | 01:13 PM