Rahul Gandhi: సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నా..
ABN , Publish Date - May 07 , 2025 | 09:29 AM
operation sindoor: భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సాయుధ దళాల చర్యలకు కాంగ్రెస్ ఏకగ్రీవ మద్దతు ప్రకటించిందని, సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.
న్యూఢిల్లీ: ‘జై హింద్.. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత (Congress leader), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పాకిస్తాన్ (Pakistan)లో భారతదేశం చేసిన త్రివిధ దళాల దాడిని ఆయన ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (operation sindoor) సాయుధ దళాల చర్యలకు కాంగ్రెస్ ఏకగ్రీవ మద్దతు ప్రకటించిందన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. ‘మన సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నాను. జై హింద్’ అని రాహుల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్‌కు చంద్రబాబు మద్దతు..
కాగా ఆపరేషన్ సింధూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఆపరేషన్ సింధూర్'కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జైహింద్ అంటూ ఎక్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జైహింద్.. జైహింద్‌కీ సేనా అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కేంద్రమంత్రులు ఏమన్నారంటే...
'భారత్ మాతాకీ జై' అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. భారత్ మాతాకీ జై అంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ అంటూ ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోస్ట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మేరా భారత్ మహాన్.. జైహింద్ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్‌ఫర్ టెర్రరిజం భారత్ మాతాకీ జై అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మద్దతు పలికారు.
Also Read: పాకిస్తాన్‌లో ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు
ఉగ్రవాదంపై భారత్ పోరాడాలి: సీపీఐ నారాయణ
ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్, పాకిస్తాన్ ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. టెర్రిరిజం వల్ల పాక్తిసాన్ కూడా అంతర్గతంగా నష్టపోతోందని చెప్పారు. టెర్రరిజంపై పోరాడాల్సిన బాధ్యత ఇండియాకు ఉందని తెలిపారు. అయితే పాకిస్తాన్‌తో యుద్దం కంటే ఉగ్రవాదంపై యుద్దం ముఖ్యమని అన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్దం వల్ల ఉగ్రవాదులు మరింత బలపడతారని నారాయణ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News