NV Ramana: పట్టభద్రులు జీవితంలోనూ రాణించాలి: ఎన్వీ రమణ
ABN, Publish Date - Jun 22 , 2025 | 02:39 PM
పట్టభద్రులకు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచనలు చేశారు. చదువుకోవడం ద్వారా మాత్రమే జ్ఞానం రాదని.. సామాజిక సృహ ఉంటేనే పరిపూర్ణులు అవుతారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న పుట్టిన ప్రాంతాన్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరువకూడదని ఎన్వీ రమణ సూచించారు.
కృష్ణాజిల్లా(గుడివాడ): కళాశాలలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులు (Graduates) జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) సూచించారు. ఇవాళ(ఆదివారం) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల 24వ గ్రాడ్యుయేషన్ డేలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు ఆయనకు గౌరవంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు గ్రాడ్యుయేట్ పట్టాలను ఎన్వీ రమణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
అనేక సమస్యల మధ్య జీవితంలోకి ప్రవేశిస్తున్న పట్టభద్రుడు ఈ వ్యత్యాసాలను గుర్తించాలని ఎన్వీ రమణ అన్నారు. చదువుకోవడం ద్వారా మాత్రమే జ్ఞానం రాదని.. సామాజిక సృహ ఉంటేనే పరిపూర్ణులు అవుతారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న పుట్టిన ప్రాంతాన్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరువకూడదని సూచించారు. భారత్‌లో రెండు దేశాలు ఉన్నాయని.. ఒకటి సుసంపన్నమైన పట్టణాలు.. రెండోది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా గ్రామాలని వెల్లడించారు. ఈ రెండింటి మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని చెప్పారు. నేడు ప్రపంచం యుద్ధంతో వణికి పోతుందని...ప్రతి ఒక్కరూ శాంతిని మాత్రమే కోరుకోవాలని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి
డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం
For More AP News and Telugu News
Updated Date - Jun 22 , 2025 | 02:44 PM